రాహుల్ పై రాజ్ నాథ్ విసుర్లు-ఆయనకు చైనాపైనే గురి-యూపీ ప్రచారంలో విమర్శలు

యూపీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని టార్గెట్ పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ సహా మిగిలిన విపక్ష పార్టీలు నిత్యం ఎన్డీయే సర్కార్ విధానాల్ని తప్పుబడుతూ రెచ్చిపోతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ... చైనా విషయంలో కేంద్రం వ్యవహారశైలిపై తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. చైనాపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న కేంద్రం.. అక్కడి నుంచి దిగుమతుల్ని ఏ స్ధాయిలో పెంచుకుంటూ పోతోందో వివరిస్తూ రాహుల్ చేసిన విమర్శలు ఎన్డీయేకు మంటపుట్టించాయి. దీనిపై ఇవాళ రక్షణమంత్రి రాజ్ నాథ్ ఎదురుదాడికి దిగారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి.

బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని టార్గెట్ పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ సహా మిగిలిన విపక్ష పార్టీలు నిత్యం ఎన్డీయే సర్కార్ విధానాల్ని తప్పుబడుతూ రెచ్చిపోతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ... చైనా విషయంలో కేంద్రం వ్యవహారశైలిపై తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. చైనాపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న కేంద్రం.. అక్కడి నుంచి దిగుమతుల్ని ఏ స్ధాయిలో పెంచుకుంటూ పోతోందో వివరిస్తూ రాహుల్ చేసిన విమర్శలు ఎన్డీయేకు మంటపుట్టించాయి. దీనిపై ఇవాళ రక్షణమంత్రి రాజ్ నాథ్ ఎదురుదాడికి దిగారు.

rajnath singhs counter attack on rahul gandhi in up poll campaign, says he trusts china

యూపీ ఎన్నికల ప్రచారం కోసం మధుర వచ్చిన రాజ్ నాథ్ సింగ్ రాహుల్ గాందీ చేసిన విమర్శలపై స్పందించారు. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ గాల్వాన్ ఘర్షణల అంశాన్ని లేవనెత్తారు, కాంగ్రెస్ పార్టీ, దాని మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. భారత సైనికుల పరాక్రమాన్ని వారు విశ్వసించడం లేదని, బదులుగా చైనా మీడియాపై ఆధారపడుతున్నారని ఆరోపించారు.

Recommended Video

    Priyanka Gandhi Effect On Telangana Politics..కాంగ్రెస్ వైపే ప్రజలు ! | Oneindia Telugu

    'భారత్ ఇప్పుడు బలహీనమైన దేశం కాదని ప్రపంచానికి సందేశం ఇచ్చామని రాజ్ నాథ్ తెలిపారు. తాము సరిహద్దును దాటి దాడి చేసే పరిస్ధితుల్లో ఉన్నట్లు గత ఘటనల్ని గుర్తుచేస్తూ వివరించారు. గాల్వాన్‌లో చాలా మంది భారతీయ జవాన్లు మరణించారని, చైనాలోని కొద్దిమందే అని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన చైనా మీడియాను నమ్ముతున్నారని రాజ్ నాథ్ ఆరోపించారు. 38 నుంచి 50 మంది చైనీయులు మరణించారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొందని, కానీ రాహుల్ మాత్రం మన ఆర్మీ జవాన్ల పరాక్రమాన్ని విశ్వసించడం లేదన్నారు. రక్షణ మంత్రిగా, భారతదేశ గర్వంపై ఎవరూ దాడి చేయలేరని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+