ఎపి, తెలంగాణ కీచులాటలు: రాజ్‌నాథ్‌నాథ్ సీరియస్

తాగు, సాగు నీరు, విద్యుత్ సరఫరా, మున్సిపల్ వ్యవహాలు లాంటి అనేక అంశాలపై రెండు రాష్ట్రాలు పరస్పరం గొడవలు పడుతున్నాయంటూ వార్తలు రావడంతో హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా రాజ్‌నాథ్ సింగ్ హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాక గతనెల 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రెండు రాష్ట్రాలు ఆస్తుల పంపకం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపులాంటి అనేక అంశాలపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌కు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలన్న కేంద్రం నిర్ణయంపైనా ఈ రెండు రాష్ట్రాలు గొడవపడుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటే సమస్య ముదురుతుందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications