చైర్మన్‌తో జవదేకర్ 'టి' వాదన, పుస్తకం విసిరిన ఎంపి
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాజ్యసభలో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ గురువారం సభలో డిప్యూటీ చైర్మన్‌తో వాదనకు దిగారు. తెలంగాణ బిల్లు కోసం బిజెపితో పాటు తెలంగాణ ప్రాంత సభ్యులు పట్టుబట్టారు.
రాజ్యసభలో తమిళనాడు ఎంపీలు కూడా నిరసన తెలిపారు. ఎంప మైత్రేయన్ సభా ఉల్లంఘనలకు సంబంధించిన పుస్తకాన్ని చైర్మన్ పైన విసిరి కొట్టారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సభలో గందరగోళం ఏర్పడటంతో మూడు గంటల వరకు వాయిదా వేశారు.

ఉసురు పోసుకోవొద్దు: హర్ష కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ పాపం ఎంతుందో, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీది కూడా అంతే ఉందని ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సమైక్యవాదుల ఉసురు పోసుకోవద్దని హర్ష విజ్ఞప్తి చేశారు. సవరణలపై ఓటింగు కోసం బిజెపి పట్టుబడాలని సూచించారు.












Click it and Unblock the Notifications