పార్లమెంటులో ఉన్నామా, ఇంకెక్కడైనానా: రాజ్యసభలో వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
సభ జరుగుతున్న తీరుపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత గం.11.20 నిమిషాలకు వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభమైన మళ్లీ ఆందోళనలు కొనసాగించడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత మరోసారి మంగళవారానికి వాయిదా పడింది.

సభలో సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. మనం పార్లమెంటులో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా అని ప్రశ్నించారు. సభలో మన తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. సభ్యులు సంయమనంతో వ్యవహరించాలన్నారు.
కానీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయన మాటలు పట్టించుకోకుండా నిరసనలు తెలిపారు. ఇలా వ్యవహరించడం సరికాదని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Recommended Video













Click it and Unblock the Notifications