వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికల ఫలితాలు.. ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వచ్చాయంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాత్రి 9 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం...బీజేపీ మొత్తం 19 సీట్లు గెలుచుకుంది. వీటిలో 16 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకోగా, మూడు స్థానాలను తాజా ఎన్నికల్లో గెలుచుకుంది.

కాంగ్రెస్ 7 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 5 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకోగా, మరో రెండు సీట్లు తాజాగా గెలుచుకుంది. టీడీపీ ఏకగ్రీవంగా రెండు స్థానాలు గెలుచుకోగా, మరో సీటు కూడా తాజాగా దక్కించుకుని మొత్తం 3 సీట్లు కైవసం చేసుకుంది.

parliament

వైఎస్ఆర్‌సీపీ ఏకగ్రీవంగా 1 సీటు దక్కించుకుంది. జేడీయూ ఏకగ్రీవంగా 2 సీట్లు, ఆర్జేడీ 2 సీట్లు గెలుచుకున్నాయి. శివసేన 1 సీటును ఏకగ్రీవంగా దక్కించుకుంది. బీజేపీ 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. టీఆర్ఎస్ 3 స్థానాలనూ కైవసం చేసుకుంది.

టీఎంసీ పోటీ చేసిన నాలుగు సీట్లు కైవసం చేసుకుని పశ్చిమబెంగాల్‌లో తనకు తిరుగులేదని చాటుకుంది. ఐదో స్థానానికి టీఎంసీ బలపరిచిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి కూడా గెలుపొందారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఓట్ల లెక్కింపులో జాప్యం చోటుచేసుకుంది. క్రాస్ ఓటింగ్, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ జాప్యం తలెత్తింది.

English summary
Results of the Rajya Sabha election have started pouring in from across the country. Counting has also started in Uttar Pradesh. It was put on hold after SP-BSP filed a complaint against the two MLAs who cross-voted. The BJP is confident of shoring up its numbers in the Rajya Sabha, but two seats — in Uttar Pradesh and Karnataka — have emerged as prestige battles for the party. In Uttar Pradesh, the ruling Bharatiya Janata Party (BJP) is sure to bag eight seats, but opposition parties may unite to prevent the saffron party from bagging the ninth seat. In Karnataka, the BJP is five votes short to ensure a victory for businessman Rajeev Chandrasekhar, but state unit president BS Yeddyurappa says he will win with 50 votes. Voting is being held for 25 of the 58 Rajya Sabha seats that will fall vacant this April. However, 33 candidates have already been elected unopposed. Overall, the BJP is in pole position with 15 Chief Ministers and coalitions in 21 states. The party plans to make full use of its overwhelming numbers in the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X