Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభ: బీజేపీకి టీఆర్ఎస్ ఝలక్ -సంస్కృతం వద్దు- హిందీనే ముద్దు - కేశ‌వ‌రావు, సురేశ్ రెడ్డి ప్ర‌మాణం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే సెంటర్ లోని అధికార పార్టీ బీజేపీకి.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రెండు సార్లు ఝలక్ ఇచ్చింది. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత దూకుడు పెంచిన బీజేపీ అనునిత్యం కేసీఆర్ సర్కారుపై తీవ్రవిమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునే పనిలో నిమగ్నమైంది. స్థానికంగా బీజేపీని లెక్కచేయనట్లుగానే వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్.. ఢిల్లీలోనూ దాదాపు అదే విధానాన్ని అవలంభిస్తున్నది. ఈ క్రమంలో సోమవారం రెండు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

సోమవారం లోక్ సభ ముగిసిన కాసేపటికే రాజ్యసభ తొలి సెషన్ ప్రారంభమైంది. ముందుగా దివంగత నేతలకు సంతాపాలు తెలిపిన తర్వాత.. కొత్తగా ఎన్నికైన లేదా తిరిగి ఎన్నికైన 15 మంది ఎంపీల చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణాలు చేయించారు. టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలో కే కేశ‌వ‌రావు తెలుగు ప్ర‌మాణం చేయ‌గా, సురేశ్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. సురేశ్ రెడ్డి మాజీ అసెంబ్లీ స్పీక‌ర్ అని వెంక‌య్య స‌భ‌కు తెలియ‌జేశారు. ఎంపీల ప్రమాణాలు పూర్తయిన వెంటనే...

Rajya Sabha: refrain from using Sanskrit words and use Hindi instead: TRS MP Keshava Rao

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఎన్టీఏ అభ్యర్థిగా జేడీయూకు చెందిన హరివంశ్ సింగ్, యూపీఏ అభ్యర్థిగా ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా పోటీలో నిలబడ్డారు. మొత్తం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 113 మంది సభ్యుల బలముంది. దీంతో జేడీయూ.. ఎన్డీఏ బయటున్న పార్టీల మద్దతు కోరింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ కు మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా నిలిచింది. ఎన్టీఏ, యూపీఏ కూటకులకు సమాన దూరం పాటిస్తామని కేసీఆర్ చెప్పినట్లే.. కేకే, సురేశ్ రెడ్డిలు ఓటింగ్ లో పాల్గొనలేదు. అయితే..

ఓటింగ్ లో పాల్గొనకపోయినప్పటికీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తిరిగి ఎన్నికైన హరివంశ్ సింగ్ ను టీఆర్ఎస్ అభినందించింది. హరివంశ్ ఎన్నికలపై ప్రధాని మోదీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు మాట్లాడిన తర్వాత.. టీఆర్ఎస్ నేత కేకే తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన జాతీయ విద్యావిధానంలో చేసినట్లే.. పార్లమెంట్ లోనూ సంస్కృత భాషను ప్రోత్సహించే దిశగా బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలను కేకే ఆక్షేపించారు.

డిప్యూటీ చైర్మన్ హోదాలో హరివంశ్ సింగ్.. రాజ్యసభలో సంస్కృత పదాల వాడకాన్ని నివారించాలని టీఆర్ఎస్ ఎంపీ కేకే సూచించారు. మెజార్టీ ఎంపీలకు అర్థంకాని సంస్కృత పదాలు వాడటం కంటే.. అందరికీ అర్థమయ్యే హిందీలోనే రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించడం మంచిదని కేకే అభిప్రాయపడ్డారు. తద్వారా బీజేపీ సంస్కృతీకరణ ప్రక్రియను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని కేకే చెప్పకనే చెప్పారు. ఆయన వ్యఖ్యలపై బీజేపీ నేతలు ప్రస్తుతానికి సైలెట్ గా ఉండిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+