Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రానికి రైతు సంఘాల డెడ్ లైన్-నవంబర్ 26లోగా బిల్లులు వెనక్కి-లేకపోతే మళ్లీ హస్తినకు పోరు

కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాలు ఇవాళ మరోసారి కేంద్రానికి హెచ్చరికలు చేశాయి. ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకునేందుకు కేంద్రానికి నవంబర్ 26వరకూ గడువు ఇచ్చాయి. ఆ లోపు బిల్లులు వెనక్కి తీసుకోకపోతే నవంబర్ 27 నుంచి తిరిగి ఢిల్లీ సరిహద్దుల్ని చుట్టుముడతామని హెచ్చరించాయి. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ఈ మేరకు కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు.

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 లోగా కేంద్రం తీర్మానం చేయాలని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ కోరారు, లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ నిరసన ప్రదేశాలకు తరలివస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఉంది, ఆ తర్వాత నవంబర్ 27 నుండి గ్రామాల నుండి రైతులు ట్రాక్టర్లతో చుట్టుపక్కల నుండి ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని, నిరసన ప్రదేశాలలో ఆందోళనను బలోపేతం చేస్తారని తికాయత్ హెచ్చరికలు జారీ చేశారు.

rakesh tikait put november 26 deadline to central government for repelling farm laws

ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని ఘాజీపూర్, తిక్రీ సరిహద్దు నిరసన ప్రదేశాల నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత రైతు నేత తికాయత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం సింగు సరిహద్దు, తిక్రీ సరిహద్దు, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు రహదారులపై కూర్చుని నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు బారికేడ్లను తొలగించడంతో హర్యానాలో నిరసన చేస్తున్న రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రాకేష్ తికాయత్ కేంద్రానికి ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

రైతులను బలవంతంగా నిరసన వేదికల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి కవాతు నిర్వహిస్తామని బీకేయూ సీనియర్ నేత గుర్నామ్ సింగ్ చదుని నిన్న ప్రకటించారు. ఆ తర్వాత రైతులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోలో గత చాలా రోజులుగా ప్రభుత్వం సరిహద్దులను తెరవడానికి ప్రయత్నిస్తోందని,. ప్రజలలో గందరగోళం నెలకొని ఉందన్నారు. దీపావళి లోపు ప్రభుత్వం రోడ్లను క్లియర్ చేస్తుందని చర్చలు జరుగుతున్నాయని ఆయన రైతులకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో తప్పు చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+