మోడీ నుంచి నేర్చుకో: మోడల్ హత్యపై షరీఫ్‌కు రాఖీ సావంత్, ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: పాకిస్తాన్ మోడల్, ఇంటర్నెట్ సంచలనం కండీల్ బలోచ్ హత్య నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించారు. ఈ హత్య పైన ఆమె తీవ్రంగా అప్ సెట్ అయ్యారు.

అక్క పరువు తీసింది, తెలియకుండా చంపేశా: పాక్ మోడల్ సోదరుడి అరెస్ట్
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కౌంటర్ ఇచ్చారు. నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని చూసి నేర్చుకోవాలని ఆమె సూచించారు.

ప్రధాని మోడీ బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఆడపిల్లలను, ఆడవారిని ఎలా రక్షించాలో మోడీని చూసి నేర్చుకోవాలని నవాజ్ షరీఫ్‌కు హితవు పలికారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

తమ ప్రధాని నరేంద్ర మోడీ అయినందుకు నేను చాలా గొప్పగా, గర్వంగా భావిస్తున్నానని రాఖీ సావంత్ చెప్పారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

ఆయన కేవలం బేటీ బచావో అని మాత్రమే చెప్పడం లేదని, దానిని అమలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని రాఖీ సావంత్ అన్నారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

భారత దేశంలో మహిళల సాధికారతకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో చట్టాలు తీసుకు వచ్చారని రాఖీ సావంత్ అన్నారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

ఆమె సోషల్ మీడియాలో తన న్యూడ్ ఫోటోలు పెట్టినందుకు హత్య గావించబడిందని భావిస్తున్నానని, అదే సమయంలో భారత సెలబ్రెటీస్‌ను ఇష్టపడ్డందుకు కూడా కావొచ్చునని పేర్కొన్నారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్, కరీనా కపూర్, తనకు పెద్ద అభిమాని అని రాఖీ సావంత్ చెప్పారు. ఆమె నరేంద్ర మోడీ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.

 కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్ హత్యపై రాఖీ సావంత్

కండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు ఎందుకు చంపేశాడని రాఖీ సావంత్ ప్రశ్నించారు. భారత సెలబ్రెటీస్‌ను ఇష్టపడ్డందుకు చంపేశారా అని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Following the death of Pakistan model, Qandeel Baloch, an upset Rakhi Sawant condemned Pakistan's Prime Minister Nawaz Sharif and said he should take lessons from his Indian counterpart Narendra Modi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి