అక్క పరువు తీసింది, తెలియకుండా చంపేశా: పాక్ మోడల్ సోదరుడి అరెస్ట్
లాహోర్: పాకిస్తాన్ హాట్ మోడల్, నటి కండీల్ బలోచ్‌ను (26) కాల్చి చంపిన కేసులో ఆమె సోదరుడు మహ్మద్ వసీమ్‌ను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. కాందీల్ అసలు పేరు ఫౌజీయా అజీమ్ అని, మోడలింగ్ పేరుతో అసభ్యకర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేస్తోందన్న కారణంతో చంపాడు.
కోహ్లీతో డేటింగ్ చేస్తానన్న పాకిస్థాన్ మోడల్ కాల్చివేత
అదే విషయాన్ని అతను మీడియాకు వివరించాడు. మా అక్క మా ఇంటి పరువును బజారుకు ఈడ్చిందని, దానిని తాను సహించలేకపోయానని, అందుకే ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నానని సోదరుడు వసీమ్ చెప్పాడు. ఈ హత్యలో నేనే నిందితుడిని అని, తన మరో సోదరుడి హస్తం లేదని చెప్పాడు.
నేను తనను చంపేస్తానని తన సోదరికి ఏమాత్రం తెలియదని, ఆమెకు ఓ టాబ్లెట్ ఇచ్చి, ఆ తర్వాత తాను ఆమె గొంతు నులిమానని చెప్పాడు.
నిందితుడు వసీమ్ బలోచ్ వయస్సు 25. అతనిని పోలీసులు సెంట్రల్ పాకిస్తాన్‌లోని డేరా ఘజీ ఖాన్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. హత్య అనంతరం నిందితుడు డేరా ఘజీ ఖాన్ పారిపోయాడని పోలీసులు చెప్పారు. అతను శనివారం ఉదయం ఆమెను ముల్తాన్ ప్రాంతంలోని కరీమాబాదులో చంపేశాడని చెప్పారు. మరో ఇద్దరితో కలిసి అతను పారిపోయాడని తెలిపారు.

కండీల్ బలోచ్
ఇంటర్నెట్ సంచలనం, పాకిస్థానీ మోడల్, నటి అయిన కండీల్ బలోచ్‌ను శనివారం ముల్తాన్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవలే కండీల్ బలోచ్ తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు సెక్యూరిటీ పెంచాలని కోరింది. ఇంతలోనే ఈ సంఘటన జరగడం దురదుష్టకరం.

కండీల్ బలోచ్
సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని కండీల్ బలోచ్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన వీడియోలను పోస్టు చేసి అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకునేది.

కండీల్ బలోచ్
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేయాలని తన మనసులోని కోరికను బహిరంగంగా వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

కండీల్ బలోచ్
కండీల్ బలోచ్ మోడలింగులోకి వచ్చాక పేరు మార్చుకుంది. కుటుంబ సభ్యులకు బలోచ్ మోడలింగ్ చేయడం ఇష్టం లేదు. మోడలింగ్ వదిలేయాలని, సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, వీడియోలను తొలగించాలని పలుమార్లు ఆమె సోదరుడు వసీమ్ బెదిరింపులకు గురి చేశాడు.

కండీల్ బలోచ్
ఇటీవల పాకిస్తాన్ ఇస్లాం మత గురువు ముఫ్తీ కావీతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టడ్ చేసింది. దీంతో మత పెద్దలు ఆయనను రుయాత ఏ హిలాల్ కమిటీ నుంచి తొలగించారు. తమ కుటుంబం పరువు తీస్తుందని సోదరుడే ఆమెను చంపేశాడు. ఈ పరువు హత్య కలకలం రేపింది.