Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Eid-ul-Fitr 2026 (Ramzan): రంజాన్ ఎప్పుడంటే ? సౌదీ అరేబియా ప్రకటన..! భారత్ లో..!

రంజాన్ (ramzan)మాసం ముగింపు దశకు చేరింది. దీంతో రంజాన్ పండుగ (Eid-ul-Fitr) కోసం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎదురుచూస్తున్నారు. భారత్ లో ఇవాళ్టికి రంజాన్ మాసం ప్రారంభమై 28 రోజులు ముగిశాయి. గల్ఫ్ దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభమై 29 రోజులయ్యాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో ఇవాళ్టి నుంచే నెలవంక దర్శనం కోసం చూపులు మొదలుపెట్టారు. సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రం తర్వాత రంజాన్ తర్వాత మాసం షవ్వాల్ నెలవంక కోసం జనం ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.

రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల

దీంతో ఈద్ అల్-ఫితర్ (రంజాన్) పండుగను మార్చి 20న జరుపుకుంటామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ న్యూస్ ప్రకారం రంజాన్ ఉపవాసాలు పూర్తవుతున్నా.. షవ్వాల్ నెలవంక కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన రిపోర్ట్స్ ను సమీక్షించడానికి సమావేశమైన నెలవంక దర్శన కమిటీ, కొత్త నెలలోకి ప్రవేశాన్ని ధృవీకరించింది. మతపరమైన సంప్రదాయాలకు అనుగుణంగా చంద్ర దర్శనం ఆధారంగా నెలల ప్రారంభాన్ని నిర్ణయించే సుదీర్ఘకాల ఇస్లామిక్ పద్ధతిని ఇది అనుసరిస్తుంది.

Eid-ul-Fitr 2026 Saudi Arabia Confirms Date After Moon Sighting
రంజాన్ స్పెషల్ సూప్.. ఇలా ఈజీగా చేసుకోండి..!
రంజాన్ స్పెషల్ సూప్.. ఇలా ఈజీగా చేసుకోండి..!

ఇవాళ అమావాస్య కావడంతో పలు దేశాల్లో నెలవంక కనిపించలేదు. దీంతో రేపు కూడా గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెల ఉపవాసాలు కొనసాగబోతున్నాయి. అనంతరం ఎల్లుండి (శుక్రవారం) పండుగ జరుపుకోవాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఈ లెక్కన ఒక రోజు ఆలస్యంగా అంటే శనివారం భారత్ లో రంజాన్ పండుగ చేసుకోబోతున్నారు. ఈ మేరకు రేపు,ఎల్లుండి కూడా భారత్ లో ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగించబోతున్నారు. మరోవైపు టర్కీ కూడా ఎల్లుండి 20వ తేదీన పండుగ జరుపుకోవాలని నిర్ణయించగా.. సింగపూర్ 21న పండుగ చేసుకుంటామని ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+