హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ?
ఇరాన్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని (strait of hormuz) మూసేయడంతో భారత్ సహా పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలు శివాలిక్, నందా దేవీలను వదిలిపెట్టాలని ఇరాన్ ను కేంద్రం కోరడంతో వాటికి విముక్తి లభించింది. దీంతో అవి సురక్షితంగా భారత్ కు చేరుకున్నాయి. వీటిలో మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) భారత్ కు వచ్చింది. అయితే ఈ ఎల్పీజీ భారత్ లో అవసరాలకు ఎన్ని రోజులకు సరిపోతుందన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ లో ఎల్పీజీ డిమాండ్ ఎలా ఉంది, దీన్ని తట్టుకునేందుకు ఈ రెండు నౌకల్లో వచ్చిన ఎల్పీజీ ఎంత మేరకు పనికొస్తుందన్న దానిపై మాజీ ఆర్ధికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం (p chidambaram) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. గూగుల్ నుంచి సేకరించిన సమాచారం అంటూ చిదంబరం కొన్ని వివరాలను ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో ఆయన ప్రస్తుతంలో భారత్ లో ఎల్పీజీ డిమాండ్ మేరకు చూసుకుంటే హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చిన రెండు నౌకల్లో ఎల్పీజీ కేవలం 2 రోజులకూ సరిపోదని తేల్చారు.

GOOGLE generated the following information:
— P. Chidambaram (@PChidambaram_IN) March 18, 2026
Based on reports from March 14-17, 2026, two Indian-flagged LPG carriers, Shivalik and Nanda Devi, successfully crossed the Strait of Hormuz, carrying a cumulative total of 92,700 metric tonnes of LPG.
•Total LPG Carried: 92,700…
2026 మార్చి 14-17 తేదీల నివేదికల ప్రకారం, భారత జెండా కలిగిన రెండు ఎల్‌పిజి నౌకలు, శివాలిక్ మరియు నందా దేవి, మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజిని తీసుకువెళ్లి హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని, ఇందులో రవాణా చేసిన మొత్తం ఎల్‌పిజి: 92,700 మెట్రిక్ టన్నులు (ఒక్కొక్కటి 46,000 మెట్రిక్ టన్నులకు పైగా తీసుకువెళ్ళింది) అని తెలిపారు. ఈ మొత్తం భారత్ లో మొత్తం వంటగ్యాస్ అవసరంలో సుమారు 1.25 నుండి 1.6 రోజులకు సమానం అని చిదంబరం తెలిపారు. రేపటి కల్లా ఈ గ్యాస్ వాడేయడం ఖాయమని, దీంతో హార్ముజ్ వైపు మళ్లీ నౌకల కోసం ఎదురూచూపులు తప్పవని చిదంబరం చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications