రాఖీ సావంత్ పార్టీ పేరు ‘రాప్’: గుర్తు ‘పచ్చి మిర్చి’

Rakhi Sawant launches party, wants 'green chilli'
ముంబై: బాలీవుడ్ ఐటెం భామ రాఖీ సావంత్ ఇక సినిమాలకు ముగింపు కలకనుంది. ఆమె శుక్రవారం తన పార్టీని ప్రకటించింది. తన పార్టీ పేరు రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీ(రాప్). శనివారం మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నుంచి లోకసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే తన పార్టీ గుర్తును పచ్చి మిరపకాయగా నిర్ణయించినట్లు రాఖీ తెలిపారు.

అంతేగాక తాను ప్రస్తుతం అనాథ రాజకీయ నాయకురాలిని లేదా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పుకున్నారు. ప్రస్తుతం నేను నా సొంత పార్టీని కలిగి ఉన్నానని తెలిపారు. తాను తన పార్టీకి ఉపాధ్యక్షురాలినని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని పోలివుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంటుందని చెప్పారు.

తాను త్వరలోనే తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. తాను పేద ప్రజల కోసం, మహిళల భద్రత కోసం కృషి చేస్తానని చెప్పారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే తన చివరి రక్తంబొట్టు పోయే వరకూ పేద ప్రజల అభివృద్ధికి కోసం పాటుపడతానని తెలిపారు. కాగా, రాఖీ సావంత్ పార్టీకి ఆఫీస్ బేరర్లుగా, ఫండ్ రైజర్లుగా స్థానిక వ్యాపారులే ఉండటం గమనార్హం. ఆ వ్యాపారుల భార్యలు పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహించనున్నట్లు తెలిసింది.

ఇటీవల రాఖీ సావంత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీ తరపునే పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాఖీ సొంతంగా పార్టీని స్థాపించారు. ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు రాఖీ చెప్పారు. అయితే తాను బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+