అయోధ్యలో నాడు ప్రతిజ్ఞ చేసిన వేదిక నుంచే నేడు మోదీ ప్రసంగం..!!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ రామ నామ జపంతో దేశం మొత్తం హోరెత్తింది. ప్రధాని మోదీ అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు లో పాల్గొన్నారు. రాముడి తొలి దర్శనం చేసుకున్నారు. సాష్ఠాంగ నమస్కారం చేసారు. ఉద్వేగానికి లోనైన ప్రధాని తన ప్రసంగంలో రాముడు చూపిన మార్గం గురించి వివరించారు. 32 ఏళ్ల క్రితం రామ జన్మభూమిలో తాను రామాలయం కట్టిన తరువాతనే అయోధ్యకు వస్తానని మోదీ ప్రతిజ్ఞ చేసిన వేదిక నుంచే నేడు రామాలయం ప్రారంభం తరువాత ప్రధాని హోదాలో ప్రసంగించారు.
మోదీ ఉద్వేగభరిత ప్రసంగం
అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీ ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడించారు. ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటించారు. త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని ప్రధాని వివరించారు. ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలని కోరారు. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించానని చెప్పారు.

మన రాముడొచ్చాడు
న్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడని ప్రధాని వ్యాఖ్యానించారు. మన బాలరాముడు ఇక నుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. గర్భగుడిలో ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. మన రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడన్నారు. 2024 జనవరి 22.. సాధారణ తేదీ కాదు.. కొత్త కాలచక్రానికి ప్రతీకగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని చెప్పారు. న్యాయస్థానాల తీర్పు తర్వాతే మన కల సాకారమైందన్నారు. సాకారమైంది. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందని వివరించారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని ప్రధాని సూచించారు.
రాజ్యాంగబద్దంగానే
ఈ క్షణం దేశ ప్రజల సహనానికి, పరిపక్వతకు నిదర్శనంగా పేర్కొన్నారు అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి నేడు ప్రాణప్రతిష్ఠ జరిగిందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే రామాలయం నిర్మించామని పేర్కొన్నారు. దేశమంతా ఈ రోజు దీపావళి జరుపుకోవాలన్నారు. దేశంలోని ప్రతి ఇంట్లో ఇవాళ రాముడి పేరిట దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. భారతదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమన్నారు. రాముడు అనుసరించిన ఆదర్శం, క్రమశిక్షణ, విలువలు మనకు పునాదులు, అవే మనకు శిరోధార్యమని ప్రధాని చెప్పుకొచ్చారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications