రాష్ట్రపతిగా రామ్‌నాథ్ ప్రమాణం నేడే
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మంగళవారం జరిగే కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్.. రామ్‌నాథ్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.
కాగా, రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న రెండో దళిత నాయకుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి అయిన కోవింద్.. విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌పై 65.5 శాతం ఓట్ల తేడాతో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం సోమవారంతో ముగిసింది. రాజ్యాంగంలోని 56వ అధికరణం ప్రకారం.. రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. అయితే దీనితో సంబంధం లేకుండా తన నూతన రాష్ట్రపతి వచ్చేవరకూ ఆయన పదవిలోనే ఉంటారు.












Click it and Unblock the Notifications