వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌కు పాకిన అల్లర్లు,31 మంది మృతి, ఖట్టర్‌పై వేటు?

డేరా బాబా అరెస్ట్ కావడంతో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు.ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా డేరా బాబా అనుచరుల విధ్వంసంపంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సైన్యం మోహరింపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఛండీఘడ్: అత్యాచార కేసులో డేరాబాబా‌ను దోషిగా తేల్చడంతో బాబా అనుచరులు పంచకులతో పాటు పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా డేరాబాబా అనుచరులు దాడులకు దిగారు.హింసాత్మక ఘటనల్లో సుమారు 31 మంది మరణించగా, 250 మంది తీవ్రంగా గాయపడ్డారు.

డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులుడేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు

ఈ తీర్పు సందర్భంగా పోలీసులు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులకు డేరాబాబా అనుచరులకు మధ్య పలుచోట్ల వాగ్వావాదాలు , తోపులాటలు, ఘర్షణలు చెలరేగాయి.

Recommended Video

: Gurmeet Ram Rahim Singh case : Angry followers creating problems across India

ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా డేరాబాబా కార్యకర్తలు విద్వంసానికి పాల్పడ్డారు. మీడియా వాహనాలపై , జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపైకి డేరా బాబా కార్యకర్తలు పలు చోట్ల రాళ్ళు విసిరారు.

సుమారు వంద వాహనాలకు నిప్పు పెట్టారు. పంజాబ్‌లో రెండు రైల్వేస్టేషన్లకు నిప్పు పెట్టారు. ఓ టెలిఫోన్ ఎక్చేంజ్‌ను దగ్దం చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్వ్యూ విధించింది.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేరాబాబా అనుచరులను అదుపు చేసేందుకు రెండు రాష్ట్రాల్లో సైన్యం రంగంలోకి దిగింది. పలు చోట్ల కాల్పులు, లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హింసాత్మక ఘటనల్లో 31 మంది మరణించగా, 250 మంది గాయపడ్డారు.

డేరాబాబా:నల్గొండ జిల్లాతో అనుబంధం, 56 ఎకరాల్లో ఆశ్రమండేరాబాబా:నల్గొండ జిల్లాతో అనుబంధం, 56 ఎకరాల్లో ఆశ్రమం

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించడంతో హర్యానాలో ఉద్రక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద బాబాకు సంఘీభావం తెలిపేందుకు రెండు మూడ్రోజులుగా లక్షల్లో పంచుకుల, సమీప ప్రాంతాలకు చేరుకున్న గుర్మీత్ మద్దతుదారులు తీర్పు వెలువడగానే ఆందోళనకు దిగారు

. తీర్పుకు వ్యతిరేకంగా హాలీడ్ ఇన్ హోటల్ సమపంలో పారామిలటరీ బలగాలు, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి వారిని చెదరగొడుతున్నారు. రెండు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. సిర్సాలోని డేరా ఆశ్రమం వద్ద రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రపతి ఖండన

గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడని తర్వాత చెలరేగిన హింసను, ఆస్తుల విధ్వంసాన్ని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఖండించారు. శాంతిని కాపాడాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ హింసను ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖండించారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి 24 గంటలు పనిచేయాల్సిందిగా ఆయన అధికారులను కోరారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. పంచకులలోను, హర్యానాలోని ఇతర ప్రాంతాల్లోనూ చెలరేగిన హింసాకాండను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు.

రైళ్లు రద్దు

రోహతక్‌కు వెళ్లే రైళ్లన్నింటినీ శనివారంనాడు రద్దు చేసినట్లు ఉత్తర రైల్వే సిపిఆర్వో నీరజ్ శర్మ చెప్పారు. 250 రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి భద్రత పెంచారు.

కర్ప్యూ

పంజాబ్‌లోని ముక్తర్, బతిండా, మన్సాల్లో కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా షామ్లీ, ముజఫర్ నగర్, భాగ్‌పట్ ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు.

డేరా ఆస్తులతో...

హింస వల్ల జరిగిన నష్టాన్ని డేరా ఆస్తులతో పూడ్చాలని హర్యానా సిద్ధపడింది. పంచకుల ప్రశాంతంగా ఉందని డిజిపి బిఎస్ సంధూ చెప్పారు. 550 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రోహతక్ జైలుకు డేరాబాబా తరలింపు

రోహతక్ జైలుకు డేరాబాబా తరలింపు

డేరాబాబా రోహతక్ జైలుకు తరలించారు పోలీసులు. సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత పోలీసులు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా రోహతక్ జైలుకు తరలించారు.రోడ్డు మార్గం ద్వారా తరలిస్తే ఇబ్బందికరపరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో పోలీసులు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా డేరా బాబాను రోహతక్ జైలుకు తరలించారు.

విధ్వంసానికి పాల్పడిన డేరా బాబా అనుచరులు

విధ్వంసానికి పాల్పడిన డేరా బాబా అనుచరులు

అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ దోషి అని హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో పంజాబ్, హ‌ర్యానాల్లో ఆయ‌న భ‌క్తులు విధ్వంసానికి పాల్ప‌డుతున్నారు. సీబీఐ కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే ఆ కోర్టు ప్రాంగ‌ణం వ‌ద్ద ఉన్న మీడియా వాహనాలపై దాడి చేశారు. వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేన్లు, బాష్పవాయువును ప్ర‌యోగించారు. పంజాబ్‌లో రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌ బంకుల‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.ఆ రాష్ట్రంలోని బటిండా, మన్సా, ఫిరోజ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర ప్రజలు సమయమనం పాటించాలని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

రెండు రాష్ట్రాల సిఎంలకు రాజ్‌నాథ్ ఫోన్

రెండు రాష్ట్రాల సిఎంలకు రాజ్‌నాథ్ ఫోన్

డేరాబాబా అనుచరుల దాడిలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనల విషయం తెలుసుకొన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం అన్ని రకాలుగా ఆదుకొంటుందని ప్రకటించారు.
పంజాబ్‌లో 75 కంపెనీల కేంద్ర బలగాలు, హరియాణాలో 35 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పంజాబ్‌, హరియాణాలోని అనేక ప్రాంతాల్లో బస్సు సర్వీసులు రద్దు చేశారు. రెండు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌, డేటా సేవలను నిలిపివేశారు.

హర్యానా మంత్రివర్గం అత్యవసర సమావేశం

హర్యానా మంత్రివర్గం అత్యవసర సమావేశం

డేరాబాబాకు శిక్ష నిర్ధారించడంతో హర్యానా మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో డేరాబాబాపై శిక్ష గురించి చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఖట్టర్.

ఢిల్లీకి పాకిన అల్లర్లు

ఢిల్లీకి పాకిన అల్లర్లు


గుర్మీత్ రామ్ రహీమ్‌ బాబా అరెస్ట్ తర్వాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి కూడ అల్లర్లు వ్యాపించాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో రేవ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పుపెట్టారు డేరా బాబా అనుచరులు. దీంతో పాటుగా మరో బస్సుకు నిప్పుపెట్టారు. ఘజియాబాద్‌లో కూడ పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

డేరా బాబా ఆస్తుల్ని అటాచ్ చేయాలి

డేరా బాబా ఆస్తుల్ని అటాచ్ చేయాలి

డేరా బాబా ఆస్తుల్ని అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లపై కోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కల్గించినందున ఆస్తుల్ని విక్రయించి నష్టాలను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించింది. సిర్సాలో పోలీసులకు డేరా బాబా అనుచరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకొంది.

రాజస్థాన్‌కు పాకిన అల్లర్లు

రాజస్థాన్‌కు పాకిన అల్లర్లు

డేరాబాబా అరెస్ట్ తర్వాత హర్యానాలో చోటుచేసుకొన్న హింసలో చనిపోయినవారి సంఖ్య 31కి చేరుకొంది. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానాలోని పంచ‌కుల‌లో చెల‌రేగుతున్న హింస‌లో మృతుల సంఖ్య 31 కి చేరింది. మ‌రో 250 మందికి గాయాల‌య్యాయి. ఈ ఆందోళ‌న రాజస్థాన్‌కి కూడా పాకింది.ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో వాహ‌నాలకు, రైల్వే స్టేష‌న్ల‌కు నిప్పు పెడుతూ గుర్మీత్ బాబా అనుచ‌రులు రెచ్చిపోతున్నారు. ప‌లు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో పోలీసులు క‌ర్ఫ్యూ విధించారు.

 హార్యానా సిఎంపై ప్రధాని అసంతృప్తి

హార్యానా సిఎంపై ప్రధాని అసంతృప్తి

డేరా బాబా అరెస్ట్ జరిగిన తర్వాత చోటుచేసుకొన్న హింసను అరికట్టడంలో వైఫల్యం చెందారని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌పై ప్రధానమంత్రి మోడీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మనోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.సీఎం ఖ‌ట్ట‌ర్ పంచ‌కుల‌లో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ రాష్ట్ర డీజీపీ ఇప్ప‌టివ‌ర‌కు తాము 1000 మంది ఆందోళ‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. ఈ ఘటనలపై కేంద్ర హోం శాఖమంత్రి నివాసంలో రేపు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

English summary
Hundreds of followers of controversial “godman” Gurmeet Ram Rahim Singh clashed with police, attacked journalist and set on fire a railway station on Friday, minutes after a CBI court convicted the Dera Sacha Sauda chief of raping two women 15 years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X