Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ram Setu: రామసేతు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్, సీజేఐకు పిటిషన్, ఆరోజు యూపీఐ !

చెన్నై: రామసేతను జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి చేసిన విజ్ఞప్తి పిటిషన్ విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామసేతను ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామసేతు వివాదం చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, ఆ విషయంపై విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందు విచారణకు రానుంది. మార్చి 9వ తేదీన విచారణ చెయ్యడానికి అవకాశం ఇస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రామసేతు నిర్మాణం ద్వంసం చేసి షిప్ చానల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆ సమయంలోనే రామసేతును ద్వంసం చెయ్యడానికి వీలుకాదని, అందుకు తాము వ్యతిరేకమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో పాటు బీజేపీ నేతలు, హిందూ సంఘ, సంస్థలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. రామసేతు నిర్మాణం విషయంలో ఆలోచించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత ఏడాదిలో అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ. బోబ్డే ముందు సుబ్రమణ్యస్వామి పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ సమయంలో రామసేతు పిటిషన్ విచారణ తన తరువాత సీజేఐ గా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ ఎన్.వి. రమణ విచారణ చేపడుతారని ఆ సందర్బంలో చెప్పారు. ఇప్పుడు సుప్పీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ముందు విచారణకు రానుంది. గతంలో రామసేతును టచ్ చేస్తే చూస్తూ ఊరుకోమని పలు పార్టీల నాయకులు హెచ్చరించారు. అయితే రామసేతు ఉంటే ఎంత ?, లేకుంటే ఎంత ? అనే టైపులో కొందరు వాదించారు. రామసేతు విషయంలో చాలాకాలంగా జరుగుతున్న వివాదంపై త్వరలో ఓ పరిష్కారం వచ్చే అవకాశం ఉందని కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామసేతు అంటే

రామసేతు అంటే


తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఉన్న పంబాన్ ద్వీపం లేదా రామేశ్వర ద్వీపం, శ్రీలంక వాయువ్యతీరం, మన్నార్ ద్వీపం మద్యలో ఉన్న సున్నపురాయి నిర్మాణానాన్ని రామసేతు బ్రిడ్జ్ అని పిలుస్తారు. రామసేతును ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామసేతును రాముడు నిర్మించారని పురాణాలు చెబుతున్నామని హిందువులు ఇప్పటికే వాదించారు.

ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ?

ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ?

గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ-1 ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని ద్వంసం చేసి సేతు సముద్రం షిప్ ఛానల్ నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో రామసేతు నిర్మాణానికి హాని జరిగితే సహించమని హెచ్చరించారు. రామసేతును జాతీయ చిహ్నంగా ప్రకటించాలని అప్పట్లో బీజేపీ నాయకులు, పలు హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేశాయి. రామసేతుకు హాని కలగకుండా షిప్పింగ్ ఛానల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అప్పట్లో హిందూ సంఘ సంస్థలు డిమాండ్ చేశాయి.

స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు

స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు


అప్పట్లో యూపీఏ-1 ప్రభుత్వం రామసేతును ద్వంసం చెయ్యడానికి ప్రయత్నించడంతో పలువురు హిందూ సంఘ, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు, 2007లోనే రామసేతు విషయంలో దాఖలు అయిన పిటిషన్ ను విచారణ చేసిన సుప్రీం కోర్టు సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో స్టే విధించింది.

సుప్రీం కోర్టులో పిటిషన్లు

సుప్రీం కోర్టులో పిటిషన్లు


రామసేతును ద్వంసం చెయ్యడానికి వీలుకాదని, అందుకు తాము వ్యతిరేకమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో పాటు బీజేపీ నేతలు, హిందూ సంఘ, సంస్థలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. రామసేతు నిర్మాణం విషయంలో ఆలోచించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సేతు సముద్రం నిర్మాణం కోసం ?

సేతు సముద్రం నిర్మాణం కోసం ?

భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా రామసేతుకు హానికలిగించకుండా సేతు సముద్రం ప్రాజెక్టు చేపడుతామని అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ-1 ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్ పాక్ జలసంధితో కలుపుతూ 83 కిలోమీటర్ల పొడవునా లోతైన రామసేతు సున్నపురాయిని తొలగించి సేతు సముద్రం నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేసింది.

అప్పటి సీజేఐ ఏం చెప్పారంటే ?

అప్పటి సీజేఐ ఏం చెప్పారంటే ?

గత ఏడాది ఏప్రిల్ లో అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ. బోబ్డే ముందు సుబ్రమణ్యస్వామి పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ సమయంలో రామసేతు పిటిషన్ విచారణ తన తరువాత సీజేఐ గా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ ఎన్.వి. రమణ విచారణ చేపడుతారని ఆ సందర్బంలో చెప్పారు. ఇప్పుడు సుప్పీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ముందు విచారణకు రానుంది.

Recommended Video

    World’s Second Largest Statue Of Saint Ramanujacharya In Hyderabad By PM Modi | Oneindia Telugu
     సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ

    సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ


    రామసేతను జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి చేసిన విజ్ఞప్తి పిటిషన్ విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామసేతను ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామసేతు వివాదం చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, ఆ విషయంపై విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందు విచారణకు రానుంది. మార్చి 9వ తేదీన విచారణ చెయ్యడానికి అవకాశం ఇస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+