తెలివైన ప్రభుత్వమైతే ఆ పని చేయాలి: సీఏఏ, ఎన్ఆర్సీలపై రామచంద్ర గుహ, బీజేపీ తీవ్ర విమర్శ

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆయనపై కర్ణాటక బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

తెలివైన ప్రభుత్వం ఐతే ఆ పని చేయాలి..

ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించేందుకు, దేశ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఎన్ఆర్సీని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్ర గుహ. అంతేగాక, సీఏఏ అనైతికం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం దీన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తెలివైనదైతే వీటిని ఉపసంహరించుకుంటుందని తన ట్వీట్‌లో రామచంద్ర గుహ పేర్కొన్నారు.

నిరసనల్లో పాల్గొని అరెస్ట్..

సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటకలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. గురువారం బెంగళూరులో చేపట్టిన నిరసనల్లో రామచంద్ర గుహ పాల్గొన్నారు, దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసనలు కూడా చేయనివ్వరా? అంటూ ఆయన ప్రశ్నించారు. నిరసనలు చేయడం పౌరుల హక్కు అని వ్యాఖ్యానించారు.

రామచంద్ర గుహ అర్భన్ నక్సలైట్ అంటూ..

ఇది ఇలావుంటే, కర్ఱాటక బీజేపీ.. రామచంద్ర గుహపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఆయనను అర్భన్ నక్సలైట్‌గా అభివర్ణించింది. చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడంటూ ట్విట్టర్ వేదకగా మండిపడింది. ‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబుఫ నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరపున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శిస్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారు' అని పేర్కొంది. అంతేగాక, రామచంద్ర గుహ వీడియో ఒకటి దీనికి జోడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+