రూ. 1లక్ష తీసుకు రండి... స్వర్గానికి టిక్కెట్లు ఇప్పిస్తా: బాబా రాంపాల్
న్యూఢిల్లీ: బాబా రాంపాల్ హర్యానాలో అమాయక ప్రజలను మోసగించిన తీరు ఒకటి తర్వాత మరొకటి బయటకు వస్తున్నాయి. తన దగ్గరకు వచ్చిన భక్తల వద్ద రూ. 1000 నుండి రూ. లక్షల్లో డబ్బులు దేవుని పేరు మీద వసూలు చేశారు బాబా రాంపాల్.
బాబా రాంపాల్ భక్త ప్రవచనాలను వినాలనుకునే భక్తులు తొలుత రూ. 1000 చెల్లించాలి. ఇందుకు గాను రాంపాల్ అనుచరులు అతనికి 'గురు మంత్ర'ను బోధిస్తారు. గురు మంత్ర అంటే ఏమో అనుకునేరు చాలా మంది భక్తులు ఉదయాన్నే పఠించే గాయత్రి మంత్రమే. ఈ కార్యక్రమం అంతటిని "నామ్‌దాన్" అని పిలుస్తారు.
ఈ గాయత్రి మంత్రాన్ని మూడు నెలలు పాటు పటిస్తే... ఆ తర్వాత సత్‌లోక్ ఆశ్రమంలో ప్రైమరీ మెంబర్ షిప్‌ను కల్పిస్తారు. ఇక సెకండరీ మెంబర్ షిప్ కింద రూ. 9000 తీసుకుంటారు. దీని పేరు "సత్‌నామ్".

ఇలా తన వద్దకు వచ్చే భక్తుల వద్ద నుండి భారీ ఎత్తున బాబా రాంపాల్ భారీ ఎత్తున డబ్బు వసూలు చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమింటటే... రూ. 1లక్ష తీసుకుని స్వర్గానికి టిక్కెట్లు ఇప్పిస్తానని చాలా మంది భక్తులను మోసగించాడని హిసార్ ఎస్పీ సత్యేంద్ర కుమార్ గుప్తా చెప్పారు.
గురువారం దాకా తమ కస్టడీలో ఉన్న బాబా రాంపాల్, తన నయా దందాను స్వయంగా వెల్లడించారని చెప్పారు. తన దందాను నిర్విఘ్నంగా సాగించేందుకు రాంపాల్ చిట్ ఫండ్ స్కీముల తరహాలో ఓ భారీ పథకాన్ని పకడ్బందీగా నడిపారని గుప్తా తెలిపారు.
చిట్ ఫండ్ కంపెనీలు తమ ఏజెంట్లకు కనీసం కమీషనైనా ఇస్తాయేమో కాని, రాంపాల్ మాత్రం తన పథకాన్ని ప్రచారం చేసిన ఏజెంట్లకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. తన భక్తులుగా మారే వారు ఒక్కొక్కరు ముగ్గురు వ్యక్తులను కాని, ఓ కుటుంబాన్ని కాని తన వద్దకు తీసుకురావాలని ఆయన టార్గెట్‌లు కూడా విధించేవారని చెప్పారు.












Click it and Unblock the Notifications