అత్తపై వ్యామోహం.. మామకు ఫుల్లుగా బీర్లు తాగించి.. చివరకు!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అత్తపై వ్యామోహం పెంచుకున్న ఓ అల్లుడు తన సొంత మేనమామనే కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తపై మోజు పెంచుకుని మామ తన కోరికకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మేనల్లుడు.. మామనే అతి దారుణంగా హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల చాకచక్యం ముందు అతని పాచికలు పారకపోవడంతో కటకటాలపాలయ్యాడు.
గుట్టు వీడిందిలా..
ఈ కథ మార్చి 13వ తేదీ రాత్రి రాంపూర్ జిల్లా సైదానగర్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఆ రోజు రాత్రి రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం, దానికి సమీపంలోనే పడి ఉన్న మోటార్ సైకిల్ కనిపించాయి. పైకి చూడటానికి ఇది ఓ సాధారణ రోడ్డు ప్రమాదంలా అనిపించినప్పటికీ.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. మృతుడి మెడ, ముఖంపై ఉన్న గాయాలు ప్రమాదంలో తగిలినవి కావని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. ఆ వ్యక్తి గొంతు నులిమి చంపబడ్డాడని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. దీంతో పోలీసులు ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

హత్య వెనుక అసలు కారణం ఇదే..
పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. మృతుడికి స్వయానా మేనల్లుడు అయ్యే వీరేంద్ర అని తేలింది. వీరేంద్ర తన అత్తపై (మామ భార్య) వ్యామోహం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే పిచ్చితో ఉన్న వీరేంద్రకు.. తన మామ ఒక పెద్ద అడ్డుగోడలా కనిపించాడు. మామ ప్రాణాలు తీస్తేనే అత్తను సొంతం చేసుకోవచ్చని భావించిన అతను తన స్నేహితుడు జితేంద్ర అలియాస్ ఛోటూతో కలిసి ఈ కిరాతక ప్లాన్ వేశాడు. రక్తసంబంధం కంటే తన అక్రమ సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చి మామను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
సినీ ఫక్కీలో ప్లాన్.. బీర్ తాగించి గొంతు నులిమి..
రాంపూర్ ఏఎస్పీ అనురాగ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు ఈ హత్యను అత్యంత పక్కాగా, సినీ స్టైల్‌లో ప్లాన్ చేశారు. పథకం ప్రకారం వీరేంద్ర తన మామను రాత్రివేళ పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మాటలతో మాయ చేస్తూ విపరీతంగా బీర్లు తాగించాడు. మామ పూర్తిగా మద్యం మత్తులోకి వెళ్లి, తనను తాను కాపాడుకోలేని స్థితికి చేరుకున్నాక.. వీరేంద్ర తన స్నేహితుడితో కలిసి దాడి చేశాడు. తన వద్ద ఉన్న మఫ్లర్‌ను మామ మెడకు చుట్టి గట్టిగా లాగి ప్రాణాలు తీశాడు. మామ కళ్లముందే గాలి ఆడక కొట్టుకుంటున్నా కనికరం లేకుండా హతమార్చాడు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం..
హత్య చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితులు మరో తెలివైన ప్లాన్ వేశారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టి, రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ బైక్, మృతదేహాన్ని ఒక పద్ధతి ప్రకారం పడేసి.. అది చూసేవారికి బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగినట్లుగా భ్రమ కలిగించేలా సీన్ క్రియేట్ చేశారు. సాక్ష్యాలను మాయం చేసి, తాము ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులోని సైంటిఫిక్ ఆధారాలు, పోలీసుల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ముందు నిందితుల తెలివితేటలు పని చేయలేదు. చివరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications