బీజేపీతో ఢీ, మోడీకి గుజరాత్ చేదు: రాహుల్ గాంధీ వెనుక నటి రమ్య
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. ఐదు పర్యాయాలు అధికారంలో ఉన్న కమలం పార్టీకి తోడు సొంత రాష్ట్రానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ జోరు కనిపించింది.
అన్నేళ్లు పాలించిన బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండాలి. కానీ అది కనిపించలేదు. అది కమలం పార్టీ సమర్థత. అలాగే కాంగ్రెస్ పార్టీకు కుల సంఘాల నాయకులు జత కలిశారు. దీంతో బీజేపీ మెజార్టీ తగ్గింది. మొత్తానికి కాంగ్రెస్ మాత్రం బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది.

బీజేపీ ఓడినంత పని కనిపించింది
బీజేపీ గెలిచినప్పటికీ ఫలితాల లెక్కింపు సమయంలో ఓడినంత పని కనిపించింది. ప్రధాని మోడీకి ఈ గెలుపు ఓ గెలుపే కాదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉండటం, పటిదార్ల ఉద్యమం, ఓబీసీ, దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని మరిచిపోతున్నారు.
Recommended Video


రాహుల్ గాంధీకి అండగా
లెక్కింపు సమయంలో ఓ దశలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, బీజేపీ వెనుకబడుతుందని తెలిసి స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. అలాంటి గట్టి పోటీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ గట్టి పోటీనివ్వడం వెనుక కుల సంఘాల నాయకులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా రాహుల్ గాంధీకి అండగా నిలిచారు.

సోషల్ మీడియా పాత్ర
గుజరాత్‌లో కాంగ్రెస్ గతంలో కంటే మంచి ఓట్లు, సీట్లు సాధించడం వెనుక సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. సోషల్ మీడియాను మాండ్య మాజీ ఎంపీ, నటి రమ్య (దివ్య స్పందన) చూస్తున్నారు. సోషల్ మీడియా ఆమె చేతికి వచ్చాక బీజేపీకి ధీటుగా ముందుకు తీసుకు వెళ్తున్నారు.

సోషల్ మీడియా అస్త్రంగా రమ్య
రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితమే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రమ్యకు సోషల్ మీడియా పగ్గాలు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. రాహుల్ ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 2014లో ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. రమ్య కూడా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రమ్య అండ్ కో సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకున్నారు.

అభివృద్ధి అంతా వట్టిదే
గుజరాత్‌లో, దేశంలో బీజేపీ చెబుతున్న అభివృద్ధి, వికాస్ అంతా ఉత్తిదే అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలం చెప్పుకోవడం తప్ప అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రమ్య సోషల్ మీడియా పగ్గాలు చేపట్టాక బీజేపీ సోషల్ మీడియాకు ధీటుగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications