వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ ద్వారా కనెక్టవుతా, భవిష్యత్తు టెక్నాలజీదే: రమ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాండ్య నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి రమ్య తన నియోజకవర్గంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వృద్ధి కోసం పరితపిస్తున్నారు.

భవిష్యత్తు అంతా టెక్నాలజీదేనని, టెక్నాలజీనితో మనం ముందుకు వెళ్లకుంటే.. వెనుకబడినట్లేనని అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గం ప్రజలు వెనుకబడటం తనకు ఇష్టం లేదంటున్నారు.

అందుకోసం తన నియోజకవర్గమైన మాండ్యలో ప్రజలందరు ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దగ్గర ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు మాండ్య పరిధిలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, కంప్యూటర్ ఉండాలని, వారితో తాను సామాజిక వెబ్ సైట్ ద్వారా కలుస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె అంబరీష్‌కు రీట్వీట్‌లో చెప్పారు.

రమ్య

కాగా, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ నటి, మాండ్య లోకసభ సభ్యురాలు రమ్య తరఫున త్వరలో ప్రచారం చేయనున్నారు.

రమ్య

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాను రమ్యకు మద్దతుగా త్వరలో ప్రచారం చేస్తానని అంబరీష్ రెండు రోజుల క్రితం చెప్పారు.

రమ్య

మాండ్య నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రమ్య భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రమ్య

రమ్య

గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ మాండ్య లోకసభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 14న ప్రచారం చేయనున్నారు.

English summary
Lok Sabha Polls 2014- Mandya Congress candidate Ramya strongly bats for internet and Social Media for Mandya people. 'The future belongs to technology, if you're not in it you will be left out .I don't want my people to be left out!' tweets Ramya as a candid reply to Minister Ambarish who admonished her 2 days back not to mingle with people in t Constituency through Internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X