ఐదు ఖురాన్లు పంచు.. యువతికి రాంచీ కోర్టు శిక్ష
రాంచీ : కుల, మతాలను కించపరుచడం నేరం. సోషల్ మీడియా మహాత్యంతో యువత అందరినీ విమర్శిస్తుంది. ఇదే విధంగా రాంచీకి చెందిన ఓ యువతి కూడా మతపరమైన పోస్ట్ చేసింది. దీంతో ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందు, ముస్లింల ఘర్షణ వాతావరణంతో ఎస్పీ జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పోస్ట్ తెచ్చిన తంటా..?
రాంచీకి చెందిన రిచాభారతి అనే విద్యార్థిని శనివారం మతపరమైన పోస్ట్ చేశారు. దీనిని ఆ వర్గం ప్రతినిధులు తప్పుపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల ఫిర్యాదుతో రిచాభారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితు యువతి అరెస్ట్‌ను హిందూ సంస్థలు తప్పుపట్టాయి. నిరసన ప్రదర్శన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రూరల్ ఎస్పీ అశుతోస్ శేఖర్ జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి .. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే రిచాభారతి కేసును రాంచీ కోర్టు విచారించింది. మతపరమైన పోస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కుల, మతాల గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని స్పష్టంచేసింది. ముస్లింలను కించపరిచినందుకు .. 5 కాపీల ఖురాన్ పంచాలని తీర్పునిచ్చింది. ఇందులో ఒకటి అంజుమన్ ఇస్లామియా కమిటీకి, మిగిలిన 4 కాపీలు పాఠశాలలు, కాలేజీ లైబ్రరీకి అందజేయాలని మేజిస్ట్రేట్ మనీశ్ కుమార్ ఆదేశించారు. ఇరువర్గాల సమ్మతితో రిచాభారతీకి బెయిల్ మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications