తిక్కతిక్క వార్తలు రాస్తే నోటీసులు ఇస్తామని హెచ్చరించిన హైకమాండ్, సీఎం ఎవరు?
న్యూఢిల్లీ/ బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవరు అనే పేరు ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నది. ఒకరి పేరు చెబితే ఇంకోకరికి కోపం, ఇంకో పేరు చెబితో మరోకరికి కోపం అంటూ ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇన్ని రోజులు వీలైనన్నిసార్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో చర్చలు జరిపినా ఫలితం మాత్రం రాలేదు.
ఇదే సమయంలో మంగవారం మధ్యాహ్నం కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అంటూ పలు కన్నడ టీవీ చానల్స్, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సిద్దరామయ్య సీఎం అవుతారని, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని, బెంగళూరులో సిద్దరామయ్య ప్రమాణస్వీకారానికి కంఠీరవ స్టేడియం రెఢీ అవుతుందని చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేశారు.

అయితే కర్ణాటకకు కాబోయే సీఎం పేరు ఇంత వరకు తాము ప్రకటించలేదని, కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అంటూ ఆయన పేరు ప్రకటించారని, పలు టీవీ చానల్స్, వెబ్ సైట్లలో ఆయన జీవితం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం రాసేశారని, ఎవరు ఇలాంటి పుకార్లు పుట్టించారో మాకు అర్థం కావడంలేదని కాంగ్రెస్ పార్టీ జాతియ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాల విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సీఎం పేరు అధికారికంగా ప్రకటించక ముందే తప్పుడు వార్తలు ప్రచారం చేసిన టీవీ చానల్స్, వెబ్ సైట్లు, సోషల్ మీడియా నిర్వహకులకు నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యిందని, ఇంకోసారి ఇలా జరిగితే కచ్చితంగా అందరికి నోటీసులు జారీ చెయ్యాలని అనుకుంటున్నామని సూర్జేవాల అన్నారు. ఎవరిని అడిగి మీరు కర్ణాటక సీఎం ఇతనే అని ప్రచారం చేస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ మీడియాను ప్రశ్నిస్తున్నది.












Click it and Unblock the Notifications