ఫైనల్ రిపోర్టు చూసి సీఎం పేరు ప్రకటిస్తారు. ఢిల్లీలో డిసైడ్ చేస్తారు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, సోమవారం రాత్రి కర్ణాటక పరిశీలకులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి అంతిమ నివేదిక సమర్పిస్తారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాల అన్నారు.
సోమవారం మద్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రణదీప్ సింగ్ సూర్జేవాలా కర్ణాటకలో ఎవరు సీఎం ? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆయన పేరు ప్రకటిస్తుందని అన్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులో సీఎల్ పీ సమావేశం జరిగిందని, ఆ సమవేశానికి 135 మంది ఎమ్మెల్యేలు హాజరైనారని రణదీప్ సింగ్ సూర్జేవాలా గుర్తు చేశారు.

ఇదే సమావేశానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు హాజరైనారని, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారని రణదీప్ సింగ్ సూర్జేవాలా గుర్తు చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సోమవారం రాత్రి లోపు తుదినివేదిక తయారు చేస్తారని రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు.
కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తుది నివేదికను సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి సమర్పిస్తారని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివేదిక పరిశీలించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించి కర్ణాటకు కాబోయే సీఎం పేరు ప్రకటిస్తారని, త్వరలోనే కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు.
సోమవారం ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం సిద్దరామయ్యతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. అయితే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి పేరును ఏఐసీసీ అధ్యక్షుడు, కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖార్గేనే ప్రకటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

ఆదివారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చి సీఎల్ పీ పార్టీ వ్యవహారాలను పరిశీలించిన వారిలో ఒకరైన పరిశీలకుడు భన్వర్ జితేంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సుమారు ఐదు గంటల పాటు కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నామని, వారు అభిప్రాయాలు ఏమిటి అని ఓ నివేదిక తయారు చేసి సోమవారం సాయంత్రం మల్లికార్జున ఖార్గేకి సమర్పిస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications