అమ్మాయిని రేప్ చేసి అబార్షన్ చేయించి, యాసిడ్ తో

భోపాల్: అమ్మాయిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసి చివరికి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన ఘటన భోపాల్ నగరంలో జరిగింది. 18 ఏళ్ల యువతి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని భోపాల్ సౌత్ ఎస్పీ అంశుమన్ సింగ్ తెలిపారు.

భోపాల్ లోని ఎంపీనగర్ సమీపంలోని షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న వీఐపీ పార్కింగ్ దగ్గర రాత్రి 10 గంటల సమయంలో 18 ఏళ్ల యువతిని పిలుచుకుని ఆమె తల్లి ఇంటికి బయలుదేరుతున్నారు.

ఆ సందర్బంలో రూపేష్, అర్పిత సక్సేనా, జైస్వాల్ అనే ముగ్గురు అక్కడికి వెళ్లారు. తల్లీ, కుమార్తెతో అమర్యాదగా ప్రవర్తించారు. చివరికి అమ్మాయిని నీఅంతు చూస్తాం, నీ మీద యాసిడ్ తో దాడి చేసి చంపేస్తాం అని బెదిరించి వెళ్లారు.

Rape survivor face acide attack threat, case lodged in Bhopal

యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల క్రితం రూపేష్ తన మీద అత్యాచారం చేశాడని, తాను గర్భవతి అయ్యానని పోలీసులకు చెప్పింది. రూపేష్ తన స్నేహితుల సహాయంతో నన్ను ఓ ప్రయివేట్ క్లీనిక్ కు తీసుకు వెళ్లి అబార్షన్ చేయించాడని పోలీసులకు చెప్పింది.

రూపేష్ తో పాటు అతని స్నేహితుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. యువతికి అబార్షన్ చేయించిన క్లీనిక్ చిరునామా కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూపేష్, అతని స్నేహితులు మాయం అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+