వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబార్షన్‌కు అనుమతివ్వలేం: హైకోర్టు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అత్యాచారానికి గురైన తన బిడ్డకు అబార్షన్ చేయించడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు నిరాశకు గురైనారు. చట్టప్రకారం ఇప్పుడు అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలోని హిమ్మత్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న వ్యక్తికి 14 సంవత్సరాల కుమార్తె ఉంది. కొన్ని నెలల క్రితం ఆ బాలికకు టైపాయిడ్ జర్వం రావడంతో ఓ వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆ సందర్బంలో వైద్యుడు బాలిక మీద పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలిక గర్బవతి అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలికకు అబార్షన్ చేయించడానికి అనుమతి ఇవ్వాలని ఆమె తండ్రి హై కోర్టును ఆశ్రయించాడు. గురువారం హై కోర్టు న్యాయమూర్తి అభిలాష కుమారి కేసు విచారణ చేశారు.

Rape Survivor in Gujarat Refused Abortion by High Court

గర్బం దాల్చిన 20 వారాల తరువాత అబార్షన్ చేయించుకోవడానికి భారతీయ చట్టం అంగీకరించదని అన్నారు. బాలిక ఇప్పుడు 24 వారాల గర్బవతి అని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో అబార్షన్ చేయించుకోవడానికి అంగీకరించమని అన్నారు.

బాలిక ప్రసవం పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, వైద్యం అందించాలని, నష్టపరిహారం కింద రూ. ఒక లక్ష బాలిక కుటుంబ సభ్యులకు అందించాలని జిల్లా యంత్రాంగానికి హై కోర్టు సూచింది. హై కోర్టు ఆదేశాల మేరకు బాలికకు సబర్ కాంత జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

English summary
Justice Abhilasha Kumari refused permission on the ground that the existing law does not allow termination of pregnancy after 20 weeks. In this case, the pregnancy was in the 24th week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X