రేపిస్టులను పబ్లిక్‌లో కాల్చి పారేయాలి: బిజెపి ఎంపీ వ్యాఖ్య

గౌహతి: రేపిస్టులను పబ్లిక్‌లో షూటింగ్ స్క్వాడ్స్‌తో కాల్చి పారేయించాలని అస్సాం బిజెపి పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యానించారు. దానివల్ల అటువంటి నేరాలు చేయడానికి ఇతరులు భయపడుతారని ఆయన అన్నారు.

బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరస్థులను ఎన్‌కౌంటర్లలో చంపేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రేపిస్టుల కోసం షూటింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని అస్సాం బిజెపి ఎంపీ రాంప్రసాద్ శర్మ అన్నారు.

Rapists must be shot dead in public, dont spare minors either: Assam BJP MP

మహిళలపై దాడి చేసినవారికి, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి, వారిని తాకినవారికి కనిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడేలా చేయాలని అన్నారు. మైనర్లను కూడా వదిలిపెట్టకూడదని అన్నారు.

అస్సాంలని నాగావ్ జిల్లాలో ఐదో తరగితి విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సఘనట నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం వంటి నేరాలను శిక్ష పడకుండా వదిలేయకూడదని అన్నారు మైనర్ రేప్ చేసినప్పుడు అతన్ని జువెనైల్‌గా ఎందుకు పరిగణించాలని ప్రశ్నించారు.

రేపిస్టులను పబ్లిక్‌గా షూట్ చేయాలి లేదా ఉరి తీయాలని అన్నారు. ఆ విధమైన శిక్ష అటువంటి నేరాలు చేసేవారికి భయం పుట్టిస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+