వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత అరుదు: చర్మం లేకుండా శిశువు జననం

|
Google Oneindia TeluguNews

నాగ్‌పూర్: అత్యంత అరుదైన చర్మ వ్యాధితో ఓ ఆడ శిశువు శనివారం నాగ్‌పుర్‌ ఆస్పత్రిలో జన్మించింది. ఈ చిన్నారికి వెలుపలి చర్మం దాదాపుగా మొత్తానికే లేదు. 'హేర్లిక్విన్‌ ఇక్థియోసిస్‌' అనే జన్యు రుగ్మత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

ప్రతి 3లక్షల జననాల్లో ఒక శిశువుకు ఈ సమస్య తలెత్తవచ్చని వైద్యులు తెలిపారు. ఈ రుగ్మత వల్ల చర్మం పైపొరలోని స్ట్రాటమ్‌ కార్నియం అనే భాగం గట్టిపడుతుంది. చిన్నారి శరీరం దట్టమైన తెల్లటి చర్మ ఫలకాలను కలిగి ఉంటుంది. వీటి మధ్య లోతైన పగుళ్లు ఉంటాయి.

helen baby

వివరాలిలా ఉన్నాయి.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం స్థానిక లతా మంగేష్కర్ హాస్పిటల్‌లో చేరింది. ఆ మహిళ శనివారం తెల్లవారుజామున ఓ పాపకు జన్మనిచ్చింది.

అయితే.. ఆ పాప ఒంటిపై అసలేమాత్రం చర్మం లేదు. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని హర్లెక్విన్‌గా వ్యవహరిస్తారని, ఈ వ్యాధితో ఓ బిడ్డ జన్మించడం దేశంలో ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు యాష్ బైనైత్, అవినాష్ బనైష్ తెలిపారు. ఆ పాప బతకడం కష్టమని చెప్పారు.

1750వ సంవత్సరం నుంచి ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఓ డజను మంది పుట్టారని, వారిలో చాలా మంది పుట్టిన కొద్దిరోజులకే మృతి చెందారని తెలిపారు.

English summary
In an extremely rare case, a baby girl with a severe congenital disorder and near-total missing external body skin, was born at a city hospital in the wee hours of Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X