రతన్ టాటాపై స్వామి షాకింగ్ కామెంట్లు, అందుకే సైరస్ మిస్త్రీపై అసూయ
ముంబై: టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టాటాల చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన చైర్మన్ రతన్ టాటా అని దుయ్యబట్టారు.
రాయ్‌పూర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి రతన్ టాటా అసలు టాటా వారసుడు కాదని, ఆయన తండ్రే ఓ దత్తపుత్రుడన్నారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంలో రతన్ టాటా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రెండు నెలల సైరస్ క్రితం మిస్త్రీ పనితీరును బోర్డు ప్రశంసించిందని, అదే అతనిపై రతన్ టాటా అసూయకు కారణమన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం, ఎయిర్ ఏసియా స్కామ్, విస్తారా భాగస్వామ్య వ్యవహారం వంటి అంశాల్లో టాటా ప్రమేయం ఉందని ఆరోపించారు.
వీటినుంచి తప్పించుకోవడానికే ఆయన సైరస్ మిస్త్రీని తప్పించారన్నారు. కానీ ఓసారి న్యాయవిచారణ ప్రారంభమైతే ఆయన తప్పించుకోలేరన్నారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలన్నారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాశానని చెప్పారు.












Click it and Unblock the Notifications