Ratan Tata: రతన్ టాటా చివరి సోషల్ మీడియా పోస్టు ఇదే- థ్యాంక్యూ ఫర్.. !
భారత దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దేశం నాకేమిచ్చిందని లెక్కలేసుకునే జనం ఉన్న రోజుల్లో దేశానికి రతన్ టాటా ఏమిచ్చారో తన సంచలన నిర్ణయాలతో అందరికీ తెలిసేలా చేసిన రతన్ టాటా అనారోగ్యంతో తుదిశ్వాస విడవడంతో భారతావని కన్నీరుపెడుతోంది. అయితే సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే రతన్ టాటా ఈ మధ్యే ఓ పోస్టు పెట్టారు. అయితే అదే చివరి పోస్టు అవుతుందని ఆయనే కాదు ఎవరూ ఊహించలేదు.
రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!
అక్టోబర్ 7న అనారోగ్యంతో రతన్ టాటా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. దీంతో చాలా మంది ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దీన్ని గమనించిన రతన్ టాటా.. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, కాబట్టి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దంటూ ఆయన సోషల్ మీడియాలో తన ఎక్స్ హ్యాండిల్ లోనే నేరుగా స్పందించారు. దీంతో రతన్ టాటా ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ నిజం కాదని, కాకూడదని అంతా అనుకున్నారు. 48 గంట్లలోనే ఆయన తుది శ్వాస విడిచారు.

అనారోగ్యంతో రతన్ టాటా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రాగానే ఆయన స్పందించారు. తన అనారోగ్యంపై వస్తున్న ఊహాగానాలు తన దృష్టికి వచ్చాయని, అయితే వాటిలో ఎంతమాత్రం నిజం లేదని టాటా తెలిపారు. తన వయసు, ఇతర పరిస్ధితుల కారణంగా తాను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు అందులో క్లారిటీ ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను బాగానే ఉన్నానని, ప్రజలు, మీడియాకు ఇలాంటి ఊహాగానాల నుంచి దూరంగా ఉండాలని రతన్ టాటా కోరారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్యూ అంటూ ఓ కామెంట్ కూడా ఈ పోస్టుకు జత చేశారు.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024












Click it and Unblock the Notifications