నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం.. నిరుపయోగంగా ఉన్న లక్షలాది బ్యాంకు ఖాతాలు మూతపడతాయని ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, పటిష్ట భద్రతను పెంచడంతో పాటు.. డిజిటల్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, మూడు రకాల ఖాతాలపై బ్యాంకులు చర్యలు తీసుకోనున్నాయి. వరుసగా రెండేళ్లపాటు లావాదేవీలు లేని 'డోర్మెంట్' ఖాతాలను నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా శాశ్వతంగా మూసివేయవచ్చు.

గత 12 నెలలుగా ఎటువంటి లావాదేవీలు లేని 'ఇన్-యాక్టివ్' ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఇక, దీర్ఘకాలంగా సున్నా బ్యాలెన్స్‌తో ఉండి, కేవైసీ అప్‌డేట్ చేయని ఖాతాలను పరిపాలనా భారం తగ్గించుకునేందుకు బ్యాంకులు తొలగించే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ భద్రతను పటిష్టం చేయడమే ఆర్‌బీఐ ముఖ్య ఉద్దేశం. వినియోగంలో లేని ఖాతాల ద్వారా మనీ లాండరింగ్, సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల, ఖాతాదారులు తమ ఖాతాలను చురుగ్గా ఉంచుకోవాలని, కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
మీ ఖాతా మూతపడకుండా ఉండాలంటే వెంటనే కొన్ని పనులు చేయాలి. ఒక చిన్న డిపాజిట్, విత్‌డ్రాయల్, లేదా డిజిటల్ పేమెంట్ (యూపీఐ), ఏటీఎం విత్‌డ్రాయల్ వంటి లావాదేవీని నిర్వహించడం ద్వారా అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అలాగే, మీ బ్యాంకు శాఖను సందర్శించి కేవైసీ వివరాలు సరిచూసుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications