వరుసగా నాలుగోసారి ఆర్బీఐ పిడుగు; మళ్లీ వడ్డీ రేట్ల పెంపు.. ఈఎంఐలు మరింత భారం!!

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇచ్చింది. రిఅర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతానికి పెంచింది. ఈమేరకు ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ

ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ

ద్రవ్యోల్బణం, తీవ్రమైన గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ విధానాలు మరియు ఆర్థిక మార్కెట్లలో గందరగోళం కారణంగా మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన రుణ రేటు లేదా రెపో రేటును 0.5 శాతం నుండి 5.90 శాతానికి పెంచింది. ఇందులో ఆర్‌బిఐ నుండి ముగ్గురు సభ్యులు మరియు ముగ్గురు బయటి సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ, ఆరుగురిలో ఐదుగురి మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకుంది.

మే నుండి వరుసగా నాలుగోసారి రెపో రేటు పెంపు

మే నుండి వరుసగా నాలుగోసారి రెపో రేటు పెంపు

మేలో 40 బేసిస్ పాయింట్ల పెంపుదల తర్వాత, జూన్ నెలలో 50 బేసిన్ పాయింట్లు, ఆగస్టు నెలలో 50 వేల పాయింట్లు, మళ్లీ ప్రస్తుతం వరుసగా నాలుగోసారి 50 బేసిన్ పాయింట్లు వడ్డీ రేటు పెంపు చేశారు. మొత్తం మీద, ఆర్‌బిఐ మే నుండి బెంచ్‌మార్క్ రేటును 1.90 శాతం పెంచింది. ఇది దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇక ఇంతకుముందు ఉన్న వడ్డీ రేటు 5.40 నుంచి ప్రస్తుతం పెరిగిన రేపో రేటు తో 5.90 శాతానికి చేరింది.

అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక విధానాల పర్యవసానంగా భారత్ ద్రవ్యోల్బణం

అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక విధానాల పర్యవసానంగా భారత్ ద్రవ్యోల్బణం

వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేయగా ఆర్బిఐ దీనిని తాజాగా 7 శాతానికి కుదించింది. ఇక ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగా అంచనా వేసింది. ఇదే సమయంలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిందని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇక వ్యవసాయ రంగ వృద్ధి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఆహారం, ఇంధనాల ధరలు పెరిగాయని, అమెరికన్ డాలర్ గరిష్టానికి చేరిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక విధానాల పర్యవసనాల ప్రభావాన్ని ప్రస్తుతం మనం చవి చూస్తున్నామని శక్తి కాంత దాస్ తెలిపారు. ప్రపంచ దేశాల వృద్ధి మందగించి, ఇవి వర్ధమాన దేశాలకు ఓ సవాలుగా నిలుస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు.

గృహ ఈఎంఐలు కట్టే వినియోగదారులకు షాక్.. పెనుభారంగా ఈఎంఐలు

గృహ ఈఎంఐలు కట్టే వినియోగదారులకు షాక్.. పెనుభారంగా ఈఎంఐలు

ఇదిలా ఉంటే భారతదేశంలో 8 నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బిఐ లక్షిత ఆరు శాతానికి మించి కొనసాగుతుంది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం సామాన్య మధ్యతరగతి ప్రజల పాలిట పెను భారంగా మారుతుంది. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం కీలక వడ్డీరేట్లను ఆర్బిఐ సవరించిన నేపథ్యంలో, వడ్డీరేట్ల పెరుగుదల చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం పెరుగుతుంది. అయితే రుణం తీసుకున్న వినియోగదారులపై ప్రతినెలా అదనంగా భారం వేయకుండా నెలల సంఖ్య పెంచుతున్నాయి బ్యాంకులు. ఈ విధంగా చూస్తే సుదీర్ఘకాలంపాటు ఈఎంఐలు కడితే ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం కూడా పెరుగుతుందని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+