వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీఐసీఐ బ్యాంకుకు‌ రూ.58.9 కోట్ల జరిమానా, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసిఐసీఐ బ్యాంక్‌కు ఆర్భీఐ రూ.58.9 కోట్ల జరిమానాను విధించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించింనందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకొంది బ్యాంకింగ్ మార్గదర్శకాలను ఐసీఐసీఐ విరుద్దంగా వ్యవహరించిందని ఈ మేరకు ఆర్భీఐ నోటీసులు జారీ చేసింది.

ప్రైవేట్ బ్యాంకింగ్ ధిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. రెండు రోజుల క్రితం ఆర్భీఐ నోటీసులను జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో ఆర్భీఐ మార్గదర్శకాలను ఐసీఐసీఐ ఉల్లంఘించిందని ఆర్భీఐ ఆ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు సుమారు రూ. 58.9 కోట్లను పెనాల్టీ విధిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించింది.

RBI slaps Rs 58.9 crore fine on ICICI Bank for failure to meet disclosure norms on sale of securities

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారంగా వ్యవహరించాలని ఆర్భీఐ సూచించింది. ఈ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులు పాటించాలని స్పష్టం చేసింది. ఆర్భీఐ హెచ్‌టీఎం పోర్ట్‌ఫోలియో నుండి నేరుగా సెక్యూరిటీల అమ్మకాలపై ఐసీఐసీ బ్యాంకుకు రూ.58.9 కోట్ల జరిమానాను విధించింది.

ఈ కేటగిరి కింద మొత్తం పెట్టుబడులు బ్యాంకు మొత్తం పెట్టుబడిలో 24 శాతానికి మించకూడదు. అయితే ఆర్భీఐ నిబంధనలను మరికొన్ని బ్యాంకులు కూడ ఉల్లంఘించాయి. దీంతో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులకు ఆర్భీఐ జరిమానా విధించింది.

English summary
The Reserve Bank of India, in a rare move, has imposed a penalty of Rs 58.9 crore on ICICI Bank, the country's biggest private bank and the third biggest overall, for failure to adhere to rules on sale of bonds in the held-to-maturity (HTM) category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X