భారత్, పాక్ కోరితే సహకారం: కాశ్మీర్ సమస్యపై బాన్ కీ మూన్

ఈ నేపథ్యంలో దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ మాట్లాడారు. సమస్య పరిష్కరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ ఒప్పందం ప్రకారం, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా కాశ్మీర్ విషయంపై చర్చించి పరిష్కార సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
అయితే, అది ఆ రెండు దేశాలు తమను కోరితే అని చెప్పారు. గతంలో తాను చెప్పినట్టుగా రెండు దేశాలు విజ్ఞప్తి చేస్తే ఈ సమస్య పరిష్కరించడంలో తమ వంతు సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి పునరుద్ధరించాలంటూ చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
అందుకే ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించాలన్నారు. కాశ్మీర్ పైన ఓ ఒప్పందం చేసుకుంటే రెండు దేశాలకు, ఆ ప్రాంతాల భద్రతకు బాగుంటుందన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకుంటే ఇరు దేశాలకు మంచిదని చెప్పారు.
ఈ ఘర్షణలో మృతి చెందిన వారి పట్ల తాను ఆవేదన చెందుతున్నానని తెలిపారు. కాశ్మీర్‌లో శాంతి ఉండాలని కోరుకుంటున్నానని, ఇది కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదుల దాడిలో పలువురు ప్రజలు, సైన్యం మృతి చెందడం, గాయపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications