నేను సిద్ధమంటూనే ట్విస్ట్ ఇచ్చిన ఖుష్బూ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: కాంగ్రెస్ పార్టీ కోసమే తాను పని చేస్తున్నానని, ఇంకెవరి కోసమే చేయడం లేదని ఆ పార్టీ ప్రచారకర్త, సినీ నటి ఖుష్బూ అన్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్ష పదవికి ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఈ రేసులో ఖుష్బూ ముందంజలో ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఖుష్బూ సోమవారం ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతొ భేటీ అయ్యారు. ఆయనతో పదిహేను నిమిషాల పాటు ఖుష్బూ మాట్లాడారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్న గెలుపు, ఓటముల గురించి రాహుల్‌తో చర్చించానన్నారు.

రాష్ట్రంలో ఇళంగోవన్ ఆధ్వర్యంలో ఓట్ల శాతం పెరిగిందని తెలిపామన్నారు.. ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ ఇళంగోవన్ పదవి నుంచి తప్పుకున్నారని, మరో పదవికి ఆయనను ఎంపిక చేయాలన్న విషయాన్ని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు.

 ఖుష్బూ

ఖుష్బూ

మంగళవారం ఉదయం ఆమె సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... తనకు అధ్యక్ష పదవి ఇస్తే అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఆ అనుభవం తనకు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు ఎంతో మంది ఉన్నారని చెప్పారు.

 ఖుష్బూ

ఖుష్బూ

వారిలో ప్రతిభావంతులైన వారిని అధ్యక్షపదవికి ఎంపిక చేయాలని సోనియాతో చెప్పానన్నారు. ఇళంగోవన్‌కు మళ్లీ అధ్యక్ష పదవి అందించాలని తాను సిఫార్సు చేశానని వెల్లువెత్తుతున్న వార్తలలో వాస్తవం లేదన్నారు. పార్టీకి సేవలందించేదుకే తానున్నాను గాని మరెవరి ఉన్నతికోసం కాదన్నారు.

 ఖుష్బూ

ఖుష్బూ

ఇదిలా ఉండగా, ఖుష్బూ రాహుల్, సోనియా గాంధీలను కలవడంతో ఆమెనే టిఎన్సీసీ అధ్యక్షులు అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడు కాంగ్రెస్‌లో పలు గ్రూపులు ఉన్నాయి. చిదంబరం, తంగబాలు, ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌, కుమరి అనంతన్‌, వసంత్ కుమార్‌.. ఇలా గ్రూపులున్నాయి.

ఖుష్బూ

ఖుష్బూ

టీఎన్సీసీ అద్యక్షుడిగా హోదాకు తగ్గ నేతను, అన్నివిధాలుగా ఆలోచించే వ్యక్తిని నియమించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందువల్లే రేసులో ఉన్న పీటర్ అల్ఫోన్స్‌, వసంత కుమార్‌, సుదర్శన్‌ నాచ్చియప్పన్, కుమరి అనంతన్‌ను కూడా ఇటీవల రాహుల్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. తాజాగా ఖుష్బూతో మాట్లాడారు. ప్రస్తుతం రేసులో ఉన్న నేతల గురించి కూడా పార్టీ అధిష్టానం ఆమె నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Congress spokesperson Khushbu on Monday met AICC vice-president Rahul Gandhi and discussed the party affairs in the state in the wake of the recent electoral drubbing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి