దేశాన్ని సరిగా అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి .. మోదీని హామీల గురించి నిలదీయాలన్న ప్రియాంక

Recommended Video

    Lok Sabha Elections 2019 : Priyanka Gandhi Sensational Comments On PM Narendra Modi | Oneindia

    అహ్మదాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ప్రియాంక గాంధీ రాజకీయ రణక్షేత్రంలో మాటల తూటాలు పేల్చారు. యూపీ పశ్చిమ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ఆమె .. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తొలి రాజకీయ ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

    ద్వేషాన్ని ప్రేమతో జయించండి

    ద్వేషాన్ని ప్రేమతో జయించండి

    బాలాకోట్ దాడులపై మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రియాంక విమర్శల జడివాన మొదలైంది. 'ప్రధాని మోదీ ముందు తెలుసుకోవాల్సింది ఇండియా స్వభావాన్ని.. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. నీతి, నిజాయితీలతో మెలగడం భారతదేశ సహజ లక్షణం. అలాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు పనిగట్టుకని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వారి బారి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది‘ అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ప్రియాకం గాంధీ.

    అవగాహనను మించిన దేశభక్తి లేదు

    అవగాహనను మించిన దేశభక్తి లేదు

    మనం స్వాత్రంత్య సమరం స్థాయిలో పోరాడాలి అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రియాంక. దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కంటే దేశ భక్తి మరోటి లేదు .. ఇది మోదీ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. దేశభక్తే మన ఆయుధం .. ఆ బలంతోనే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని శ్రేణులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు ప్రియాంక .

    మీ చేతిలో వజ్రాయుధం

    మీ చేతిలో వజ్రాయుధం

    ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటే వజ్రాయుధమని .. మీ చేతిలో ఉన్న ఆ అస్త్రాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు ప్రియాంక గాందీ. కొందరు ఎన్నికల సమయంలో ముందుకొచ్చి పెద్ద మాటలు మాట్లాడతారు. వారిని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి నిలదీయండి అని పిలుపునిచ్చారు.

     15 లక్షలు ఏవీ ? కోటి ఉద్యోగాలు ఎక్కడ

    15 లక్షలు ఏవీ ? కోటి ఉద్యోగాలు ఎక్కడ

    గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు ప్రియాంకగాంధీ. ప్రతి ఖాతాదారుడి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ మాట ఏమైందో అడుగాలని కోరారు. అలాగే ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారని .. ఎంతమందికి ఉపాధి కల్పించారో వివరించాలని ప్రశ్నించాలని కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+