Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navneet Rana: రాష్ట్రపతి పాలన పెట్టండి, తిక్క కుదురుతుంది, అమిత్ షాకు అమరావతి ఎంపీ !

ముంబాయి/గుహవాటి/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రతను మహారాష్ట్ర పోలీసులు వెనక్కి తీసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత వెనక్కి తీసుకున్న వెంటనే శివసేన కార్యకర్తలు రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు ధ్వంసం చెయ్యడం మొదలు పెట్టారు. ఈ సందర్బంలో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అలియాస్ నవనీత్ రాణా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మనవి చేశారు. అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం తిక్క కుదురుతోందని నవనీత్ రాణా అంటున్నారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేల భార్యలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కరువైయ్యిందని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు, వారి ఆస్తుల మీద శివసేన కార్యకర్తలు దాడులు చెయ్యడం మొదలు పెట్టడంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన పంజా

రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన పంజా

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రతను మహారాష్ట్ర పోలీసులు వెనక్కి తీసుకున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత వెనక్కి తీసుకున్న వెంటనే శివసేన కార్యకర్తలు రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు ధ్వంసం చెయ్యడం మొదలు పెట్టారు. ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.

 రాష్ట్రపతి పాలన పెట్టండి, ఎంపీ నవనీత్ రాణా

రాష్ట్రపతి పాలన పెట్టండి, ఎంపీ నవనీత్ రాణా

మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజక వర్గం ఎంపీ నవనీత్ కౌర్ అలియాస్ నవనీత్ రాణా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మనవి చేశారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేల భార్యలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కరువైయ్యిందని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు.

హడలిపోతున్న రెబల్ ఎమ్మెల్యేలు

ఈ సందర్బంగా నవనీత్ రాణా మాట్లాడిన వీడియోను ఏఎన్ఐ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. శనివారం మహారాష్ట్రలోని శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు, వారి ఆస్తుల మీద శివసేన కార్యకర్తలు దాడులు చెయ్యడం మొదలు పెట్టడంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా కొందరు రెబల్ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+