లాలూ కూతురిపై ఆర్‌జెడి తిరుగుబాటు నేత పోటీ
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) తిరుగుబాటు నేత రామ్ కృపాల్ యావద్ ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురిపై పోటీ చేయనున్నారు. లోకసభ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామాచేశారు. తాను లాలూ ప్రసాద్ యాదవ్ కూతురిపై పాటలీపుత్రం లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన సోమవారం తెలిపారు.
తాను పాటలీపుత్ర సీటు నుంచి పోటీ చేస్తానని, తన మద్దతుదారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అభ్యర్థిగా పాటలీపుత్ర నుంచి తన కూతురు మిసా భారతిని పోటీకి దించాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడంతో రామ కృపాల్ తిరుగుబాటు బావుటా ఎగురేశారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, మరే పార్టీ అభ్యర్థిగానైనా పోటీ చేస్తారా అనే విషయాన్ని ఆయన తెల్చలేదు. బీహార్ పాలక బార్టీ జనతాదళ్ (యునైటెడ్), బిజెపి కూడా ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. రామ్ కృపాల్‌ను తమ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని బిజెపి బీహార్ నేత సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.
రామ్ కృపాల్ యాదవ్‌ను తమ పార్టీలోకి రావచ్చునని జెడి(యు) సీనియర్ నేత ఆర్‌సిపి సింగ్ చెప్పారు. ప్రస్తుతానికి తాను ఆర్‌జెడిలో ఉన్నానని శనివారంనాడు యాదవ్ చెప్పారు అయితే, ఆయన పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications