గతంలో మిజోరాం ఎన్నికల గణాంకాలు: ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ నెగ్గుకొస్తుందా..?
మిజోరాం: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అంటే నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీలకు పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 2013లో మిజోరాం పరిస్థితి ఎలాగుందో ఓ సారి పరిశీలిద్దాం. మిజోరాంలో క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉంది. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలున్న మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ తమ అభ్యర్థులను 31 స్థానాల్లో పోటీకి నిలబెట్టింది. అయితే ఇందులో 5 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.
2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 32 స్థానాలు గెలుచుకోగా... మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ మూడు సీట్లు, మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ రెండు సీట్లు, జోరామ్ నేషనలిస్టు పార్టీ రెండు సీట్లు, మరాలాండ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఒక స్థానం గెలుచుకున్నాయి. 2013లో 40 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 6.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా బరిలో 142 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 40 మంది అభ్యర్థులు, మిజోరాం డెమొక్రాటిక్ అలయన్స్ నుంచి 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఈ కూటమిలో మిజో నేషనల్ ఫ్రంట్ 31 స్థానాల్లో పోటీచేయగా... మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి 8 మంది అభ్యర్థులుమరలాండ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేశారు. జోరాం నేషనలిస్టు పార్టీ నుంచి 38 అభ్యర్థులు పోటీచేయగా... 17 మంది భారతీయ జనతా పార్టీ నుంచి, ఇద్దరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేశారు.మరో అభ్యర్థి జై మహాభారత్ పార్టీ నుంచి పోటీచేశారు.

ఇక ఈ సారి ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో ఈ ప్రాంతీయపార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఓటు షేరు చూస్తే రెండు పార్టీల మధ్య పెద్దగా తేడా కనిపించదు.2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2,55,917 ఓట్లు కాంగ్రెస్‌కు పోల్ అవగా అంటే 44.63శాతం ఓట్లు హస్తం పార్టీకి దక్కగా... మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి 1,64,305 ఓట్లు అంటే 28.65శాతం ఓట్లు వచ్చాయి. అదే 2008లో ఈ మార్జిన్ మరింత తక్కువగా ఉంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 1,95,614 ఓట్లు రాగా అంటే 38.89 ఓటు శాతం ఆ పార్టీ దక్కించుకోగా... మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ 1,54,132 ఓట్లు అంటే 30.65 శాతం దక్కించుకుంది. ఈ సారి కాంగ్రెస్ మరో సారి విజయం సాధిస్తే లాల్ తన్హావ్లా మూడో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారు.
మిజోరాం జనాభా:
మతం పేరు జనాభా శాతం
క్రైస్తవులు 9,56,331 87.16%
బౌద్ధులు 93,411 8.51%
హిందువులు 30,136 2.75%
ముస్లింలు 14,832 1.35%
మతం లేని వారు 1,026 0.09%
ఇతర మతస్తులు 808 0.07%
జైన్ 376 0.03 %
సిక్కులు 286 0.03%
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications