చంపేస్తారంట, అయినా భయపడను, పార్టీని స్థాపించడం ఖాయం: కమలహాసన్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చంపేస్తామ‌ంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, అయితే తాను అలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని ప్రముఖ సినీన‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు.

త‌మిళ‌నాడులో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల‌ని కమల్‌ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.... దేశంలో మార్పు అవసరమ‌ని ఆ మార్పు త‌న‌తోనే, తమిళనాడు నుంచే రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.

kamal-hassan

ప్రతి పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుందని కమల హాసన్ అన్నారు. త‌న‌ జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నాన‌ని, వారితో ఫొటోలు దిగానని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేద‌ని చెప్పారు.

త‌న‌ ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క‌ పార్టీ ఉన్నట్లుగా త‌న‌కు అనిపించ‌లేద‌ని చెప్పారు. శశికళను తొలగించడం, అన్నాడీఎంకే పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు.

దేశంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయిందని అన్నారు. 'ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, నాయ‌కులు ఓట్ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే వారిని తొల‌గించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు కావాలి' అన్నారు. భార‌త‌ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే తాను చెబుతోన్న ఐడియానే మంచి మార్గమ‌ని హిత‌వు ప‌లికారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Veteran actor Kamal Haasan is set to take the plunge into politics with the likely launch of a political outfit by the end of September. Hasaan – who over the last couple months has made his views known about the deteriorating state of politics in Tamil Nadu – has set his eyes on the local body elections, with over 4,000 candidates, which are expected to be held in November. While an official announcement hasn’t been made yet, a close aide to the actor told that “the upcoming local body elections have made it a necessity for him to step in,” and that the announcement of the political party is likely to come in a few days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి