గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. యూపీ, ఉత్తరాఖండ్‌లోనూ భారీగా నమోదు ! ..
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతం ప్రశాంతంగా జరిగింది. ఉత్తరాఖండ్‌లోని 70, గోవాలోని 40 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. యూపీలో 55 అసెంబ్లీ స్థానాల్లో రెండో విడత పోలింగ్ జరిగింది. గోవాలో ఓటింగ్ రికార్డు స్థాయిలో నమోదయింది.

యూపీలో 62.22 శాతం పోలింగ్
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ను అధికారులు నిర్వహించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత 55 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీలో 62.22 శాతం పోలింగ్ నమోదు అయింది.

ఉత్తరాఖండ్ 62 శాతం పోలింగ్
ఇక, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70స్థానాలకు ఒకేసారి ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 632మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉత్తరాఖండ్ లో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్‌లో మొ త్తం 82.67లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యువకులు , వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గోవాలో 80శాతం పోలింగ్
అటు గోవాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 11.57లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5గంటల వరకు 79.94 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ నెల 20న మూడో దశ పోలింగ్
ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో గోవాలో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా యువ ఓటర్లు ఎంతో ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు యూపీ, ఉత్తరాఖండ్ లోనూ భారీగానే ఓటింగ్ నమోదైంది. వృద్ధులు, వికలాంగులు సైతం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసి తమ చైతన్యాన్ని చాటారు. ఇక మూడో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది.












Click it and Unblock the Notifications