ఎర్రచందనం-స్మగ్లింగ్: ప్రపంచంలో శేషాచలంలోనే, ఎన్నో షాకింగ్ విషయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్, మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ సంఘటన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదానికి కూడా కారణమయినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్ర చందనంకు అంత డిమాండ్ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అందర్నీ తొలుస్తాయి.
ఈ ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఇక్కడి ఎర్ర చందనంకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉంది. ఎర్ర చందనం స్మగ్లస్... ముఖ్యంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్స్ కూలీల నుండి దీనిని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసి, అంతర్జాతీయ మార్కెట్లో భారీ ధరకు అమ్ముకుంటారని తెలుస్తోంది.

కూలీల నుండి రూ.500కు కొనుగోలు చేయడం లేదా కూలీలను పెట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం చేస్తారు. దీనిని అంతర్జాతీయ మార్కెట్లో అంతకు వంద రెట్లకు అమ్ముకుంటారని సమాచారం. ఎర్ర చందనం టన్నుకు చైనా మార్కెట్లో కోటి రూపాయల వరకు ఉంది.
ఏపీ అధికారులు, మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... గత రెండేళ్లలో 25వేల టన్నుల ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది. దీని వల్ల శేషాచలం వాతావరణ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎర్ర చందనం శేషాచలంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండవు. దీంతో దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో విలువ ఉంది. అదే సమయంలో భారత దేశంలో అంతగా డిమాండ్ లేదు. శేషాచలంలోని ఎర్ర చందనం కాపాడుతాని ఐయూసీఎన్‌కు భారత దేశం హామీ ఇచ్చింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనాన్ని టన్నుకు రూ.29 లక్షల చొప్పున అమ్మిందని సమాచారం. దీంతో ప్రభుత్వానికి 1000 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. దీనిని 2014 సెప్టెంబర్ నెలలో వేలం వేశారు. అయితే, ఇది ప్రభుత్వం అమ్మకం ధర. కానీ దీనికి బయట మరెంతో ఎక్కువ రేటు ఉందని చెబుతున్నారు. దీని విలువ రూ.70 లక్షల వరకు పలుకుతుందని చెబుతున్నారు.

చైనా, జపాన్, కొరియా వంటి దేశాలలో అయితే రూ.కోటి కూడా పలుకుతుందని సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ వల్ల వాతావరణం బ్యాలెన్స్ తప్పడమే కాకుండా ప్రభుత్వం ఖజానాకు భారీగా గండి పడుతుందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. స్మగ్లర్ల వల్ల అరుదైన ఎర్ర చందనం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications