బాత్రూం కట్టించలేదని విద్యార్థిని ఆత్మహత్య
దుమ్కా(జార్ఖండ్): నిత్యం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లవలసి వస్తుందనే అవమానంతో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జర్ఖండ్ లోని దుమ్కా జిల్లా గోశాల ప్రాంతంలో జరిగింది.
యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. గోశాలలో కుమారి (17) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నది. ఈమె కుటుంబ సభ్యులు ఇంటిలో బాత్ రూమ్ కట్టించలేదు.
కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రతి రోజు బయటకు వెళ్లవలసి వస్తుందని, చాల అవమానంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాను వయస్సుకు వచ్చానని కుమారి పదేపదే చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు.

నీ పెళ్లి జరిగే లోపు తాము కచ్చితంగా ఇంటిలో బాత్ రూం కట్టిస్తామని, పెళ్లి కోసం ఇప్పుడు డబ్బులు కూడబెడుతున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఈ విషయం జీర్ణించుకోలేని కుమారి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తరువాత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బాత్ రూమ్ కట్టించలేదని విషయంలోనే విరక్తి చెంది కుమారి ఆత్మహత్య చేసుకునిందని దుమ్కా జిల్లా ఎస్పీ విపుల్ శుక్లా తెలిపారు. గోశాల ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications