వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళుల దెబ్బకు దిగొచ్చిన జొమాటో.. హిందీ నేర్చుకోమన్న ఏజెంట్, భాషతో పెట్టుకుంటే ఏం జరిగిందంటే !!

|
Google Oneindia TeluguNews

భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళులు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు షాక్ ఇచ్చారు. ఎంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాకపోతే ఎలా అంటూ జొమాటో ఎగ్జిక్యూటివ్ ఓ తమిళ వినియోగదారుడికి చెప్పిన సమాధానంతో రిజెక్ట్ జొమాటో అంటూ కస్టమర్ చేసిన పోస్ట్ ట్రెండ్ అయ్యింది. ఇదే సమయంలో హిందీ జాతీయ భాష కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం మొదలుపెట్టారు తమిళులు. దీంతో తమిళుల దెబ్బకు జొమాటో దిగి రావలసి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే

జొమాటో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ హిందీ నేర్చుకోవాలని తమిళ కస్టమర్ కు సలహా


తమిళనాడు రాష్ట్రానికి చెందిన వికాస్ అనే కస్టమర్ జొమాటో తో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వికాస్ తాను ఇచ్చిన ఆర్డర్ లో ఒక వస్తువు మిస్ కావడంతో, తన ఆర్డర్ లో ఒక వస్తువు రాలేదని గమనించి జొమాటో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేశారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కాల్ చేసిన వినియోగదారుడు వికాస్ కి హిందీ తెలియదని, అతను ఏం చెబుతున్నాడో అర్థం కావడం లేదని హిందీలో మాట్లాడాలని పేర్కొన్నారు. వికాస్ హిందీ తనకు రాదనీ చెప్పటంతో, కస్టమర్ చెప్పింది తనకు అర్ధం కాలేదని అతని వస్తువులు తిరిగి పంపించలేమని చెప్పారు.

రిజెక్ట్ జొమాటో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్


ఎంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాదంటే ఎలాగండి? నాకు తమిళ్ రాదు మీరు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ రిజెక్ట్ జొమాటో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది కాస్త ట్విట్టర్లో ట్రెండ్ కావడంతో జాతీయ భాష హిందీ కాదంటూ పెద్ద ఎత్తున హిందీ భాషపై విముఖత వ్యక్తమైంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే తమిళ భాషను అర్థం చేసుకునే వారిని సిబ్బందిగా నియమించుకోవాలి అని వికాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

హిందీ జాతీయ భాష కాదని ప్రచారం

హిందీ మన జాతీయ భాష కాబట్టి ప్రతి ఒక్కరు జాతీయ భాష నేర్చుకోవాలి అని చెప్పిన జొమాటో ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యలపై వికాస్ సోషల్ మీడియాలో మండిపడ్డారు. భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలన్న సంగతి మీరు చెబితే నేను వినాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే హిందీ జాతీయ భాష కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో HindiIsNotNationalLanguage హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫుడ్ డెలివరీ కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్ తెలియక చేసిన తప్పు జాతీయ సమస్యగా మారింది.

దిగొచ్చిన జొమాటో .. సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తొలగింపు, తమిళులకు క్షమాపణ

దిగొచ్చిన జొమాటో .. సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తొలగింపు, తమిళులకు క్షమాపణ


ఇక ఈ క్రమంలోనే ఈ వివాదం మరింత ముదురుతుండడంతో దిగొచ్చిన జొమాటో కస్టమర్ తో పాటుగా తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. వెంటనే సదరు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ను విధుల నుంచి తొలగించింది. అతను చేసింది తెలియక జరిగిన పొరపాటుగా జొమాటో పేర్కొంది . కస్టమర్ కేర్ సెంటర్ ఏజెంట్ ప్రవర్తనకు మమ్మల్ని క్షమించాలని పేర్కొన్న జొమాటో ప్రజలు తమను తిరస్కరించ వద్దని కోరుతూ వణక్కం అంటూ తమిళ భాషలో నమస్కరించి తమిళ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది జొమాటో. భాష తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తమిళ ప్రజలు జొమాటోకు అర్థమయ్యేలా చెప్పారు.

English summary
Within hours of food delivery company Zomato sacking an employee for saying a customer from Tamil Nadu to learn Hindi, the customer keep post on reject zomato, at the same time, HindiIsNotNationalLanguage trending now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X