వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విడుదల చేయండి లేదంటే చనిపోనివ్వండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాంచీ: శిక్షణాకాలం పూర్తి చేసుకున్నా రాష్ట్ర అధికారిక యంత్రాంగం తమను విడుదల చేయడం లేదంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గడిచిన 20 సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేకుంటే మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపాలని జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు ఖైదీలు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తమ కుటుంబాలు దారిద్ర్యంలో అల్లాడుతున్నాయని, పిల్లలకు చదువు లేకుండా పోయిందని, వారి దుర్భర పరిస్ధితి తమను మానసికంగా ఆందోళనకు గురి చేస్తోందని వారు ఆ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. శిక్షణా కాలం పూర్తైన తర్వాత కూడా అధికారులు తమను విడుదల చేయడం లేదంటూ రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, జార్ఖండ్ గవర్నర్, సీఎంలకు పంపారు.

Release or let die: 130 prisoners in Jharkhand write to President seeking mercy killing

సరైన విధానంలో రాసినటువంటి ఈ లేఖను బిర్సా ముండా సెంట్రల్ జైలు సూపరిండెంట్ అశోక్ కుమార్ చౌదరి, ఐజీ ప్రిజన్స్‌‌తో పాటు మిగతా వారికి పంపినట్లు తెలుస్తోంది. ఈ లెటర్‌పై 130 మంది ఖైదీలు సంతకాలు చేశారు.

సాధారణంగా శిక్షణా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను జార్ఖండ్ రాష్ట్ర సెంటెన్స్ రివ్యూ బోర్డు సిఫార్సుల మేరకు విడుదల చేస్తారు. జూన్ 20, 2014 తర్వాత ఒక్కసారి కూడా బోర్డు సమావేశం కాకపోవడంతో ఖైదీలు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

English summary
130 prisoners at Ranchi’s Birsa Munda central jail wrote to President Pranab Mukherjee on Thursday demanding ‘mercy killing’ as they were not released even after having completed their 20-year term in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X