జియో ప్రీపెయిడ్ రీచార్జ్... ఇప్పుడు పేటీఎంలో!
మీరు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ఖాతాదారులా? అయితే ఇకనుంచి మీరు పేటీఎం ద్వారా మీ జియో నంబరుకు రీచార్జ్ చేసుకోవచ్చు.
ముంబై: మీరు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ఖాతాదారులా? అయితే ఇకనుంచి మీరు పేటీఎం ద్వారా మీ జియో నంబరుకు రీచార్జ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జియో తన ప్రైమ్ మెంబర్ షిప్ పథకం రిజిస్ట్రేషన్లను మార్చి 1 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దీనికోసం ఈనెల 31 వరకు జియో గడువు కూడా విధించింది. అనంతరం ప్రీపెయిడ్ వినియోగదారులు తాము ఎంచుకునే ప్లాన్స్ ప్రకారం రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అదే పోస్ట్ పెయిడ్ అయితే ప్లాన్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో.. జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులు సులభంగా తమ నంబర్లకు రీచార్జ్ చేసుకునే సౌకర్యాన్ని పేటీఎంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వినియోగదారులు ఇప్పుడు పేటీఎం ద్వారా కూడా జియో నంబర్లకు రీచార్జ్ చేసుకోవచ్చు.
మొబిక్విక్, రీచార్జ్ ఇట్ నౌ వంటి యాప్ లలో కూడా జియో రీచార్జ్ కోసం ప్రత్యేక ఆప్షన్లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఈ జాబితాలో పేటీఎం కూడా చేరింది. అయితే వీటిలో జియో పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లంపు కోసం ఇంకా ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications