జియోకు షాక్: రూ.293, రూ.449లకే ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్

రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్లాన్స్‌ను ప్రకటించిన వెంటనే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ కొత్త ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఇప్పటికే ఎయిర్‌సెల్ తన ప్లాన్స్‌ను ప్రకటించింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్లాన్స్‌ను ప్రకటించిన వెంటనే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ కొత్త ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఇప్పటికే ఎయిర్‌సెల్ తన ప్లాన్స్‌ను ప్రకటించింది.తాజాగా ఎయిర్‌టెల్ కూడ రెండు కొత్త ప్లాన్స్‌ను వినియోగదారుల ముందుకు వచ్చింది.

రిలయన్స్ జియో ప్రకటించిన ప్లాన్లకు ధీటుగా ప్రత్యర్థి కంపెనీలు కూడ కొత్త ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఎయిర్‌టెల్ ప్రకటించిన రూ.293 ప్లాన్ జియో ప్లాన్‌కు గట్టిపోటీని ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది.

జియో తరహలోనే ఎయిర్‌టెల్ కూడ ఈ తరహప్యాకేజీని అమలుచేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఇది కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకోసమేనని ఎయిర్‌టెల్ ప్రకటించింది.

84 రోజులపాటు కొత్త ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందించేలా ఎయిర్‌టెల్ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ జియో ప్లాన్‌ను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

రెండు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్

రెండు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ రెండు కొత్త ప్యాకేజీలను ప్రకటించింది. రూ.293, రూ.449లకే రెండు కొత్త ప్లాన్స్‌ను అమల్లోకి వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. కొత్త ప్లాన్లను తన కస్టమర్లకోసం తీసుకువచ్చింది.రూ. 293 రీఛార్జీ ప్యాక్‌పై 84జీబీ వరకు డేటాను 84రోజులపాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. మరోకటి రూ.449 ప్లాన్. దీని కింద కూడ 84 జీబీ డేటాను 84 రోజులపాటు వాడుకోవచ్చు. కాల్స్ సౌకర్యం పొందే దగ్గర కూడ ఈ రెండు ప్లాన్స్‌పై అందించే ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.

Recommended Video

    How to get Jio Prime membership for free | Oneindia News
    వాయిస్ కాల్స్ విషయంలో తేడాలు

    వాయిస్ కాల్స్ విషయంలో తేడాలు

    రూ.499 ప్లాన్‌లో అన్ని నెంబర్లకు అపరిమిత ఎస్‌టిడి, లోకల్‌కాల్స్ చేసుకోవచ్చు. కానీ, రూ.293 ప్లాన్‌పై కాల్స్ చేసుకొనే సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఉచితకాల్స్ కేవలం ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకోవడానికి మాత్రమే వీలున్నట్టు పేర్కొంది.

    ఈ రెండు ప్లాన్‌లలో డేటా వాడకంలోనూ తేడా

    ఈ రెండు ప్లాన్‌లలో డేటా వాడకంలోనూ తేడా

    ఈ రెండు ప్లాన్‌లలో రోజువారీ డేటా వాడకంలో 1 జీబీ తేడా మాత్రమే. ఒకవేళ కేవలం డేటా కోసం మాత్రమే సిమ్ వాడే కష్టమర్లకు రూ. 299 ప్లాన్ మెరుగ్గా ఉంటుందని, రెగ్యులర్‌గా సిమ్‌కార్డు వాడేవారికి రూ.499 ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్ కంపెనీ ప్రకటించింది.

    కొత్తవారికి మాత్రమే ఈ ప్లాన్స్

    కొత్తవారికి మాత్రమే ఈ ప్లాన్స్

    ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్లకు ఈ ప్లాన్స్ వర్తించవు. కొత్తగా ఎయిర్‌టెల్ సిమ్ తీసుకొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది. రిటైర్ల వద్ద తమ ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అయితే 84 రోజులైన తర్వాత పరిస్థితి ఏమిటనే విషయాన్ని కంపెనీ ప్రకటించలేదు. ఇటీవలే తమ పోస్ట్‌పెయిడ్ కష్టమర్లకు అందిస్తున్న హలిడే సర్‌ప్రైజ్ ఆఫర్‌ను మరోసారి పొడిగించింది. కొత్తగా మాన్‌సూన్ సర్‌ప్రైజ్ ఆఫర్ కింద వచ్చే 3 బిల్లింగ్ సైకిల్స్‌లోనూ ప్రతినెల 10 జీబీ 4 జీబీ డేటాను తమ కష్టమర్లకు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇదీ కూడ ఎంపికచేసిన కష్టమర్లకు మాత్రమే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+