జియోదెబ్బ: 72% తగ్గిన ఎయిర్ టెల్ లాభం, వరుసగా రెండోక్వార్టర్ లో ఆదాయం క్షీణత
భారతీ ఎయిర్ టెల్ ఆర్థికఫలితాలపై రిలయన్స్ జియో తీవ్ర ప్రభావం చూపింది.గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్ లో ఎయిర్ టెల్ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది.
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్ టెల్ ఆర్థికఫలితాలపై రిలయన్స్ జియో తీవ్ర ప్రభావం చూపింది.గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్ లో ఎయిర్ టెల్ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది.
రిలయన్స్ జియో ప్రభావం ఇతర టెలికం కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.ఈ ప్రభావంతో దేశీయ టెలికం కంపెనీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ తన లాభాలను భారీగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉచిత ఆఫర్లతో పాటు ప్రత్యర్థి కంపెనీలపై తిరుగులేని దెబ్బతీసేందుకుగాను జియో అనేక కొత్త కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. రోజుకో కొత్త ఆఫర్లతో జియో తన కస్టమర్లకు ప్రకటించింది.
జియో ఇస్తున్న ఆఫర్ల కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను ఇచ్చేందుకు ముందుకురావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఈ తరుణంలోనే జియో తరహాలోనే ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు కూడ ప్రకటించాయి.దీని కారణంగా తమ ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

72% తగ్గిన ఎయిర్ టెల్ లాభం
రిలయన్స్ జియో ప్రభావం కారణంగా ఎయిర్ టెల్ 72% లాభాలు తగ్గాయి.2015-16 ఆర్థిక సంవత్సరంలో క్వార్టర్ 4 లో రూ.1,319 కోట్లుగా ఉన్న నికరలాభం. అయితే గత ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 4 లో రూ.373 కోట్లకు తగ్గిందని ఎయిర్ టెల్ ప్రకటించింది.గత ఏడాది జనవరి-మార్చి క్వార్టర్ లో ఎయిర్ టెల్ నికరలాభం ఏకంగా 72 శాతం తగ్గింది.రిలయన్స్ జియో పోటీ తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ ఎండి సిఈఓ గోపాల్ విఠల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.24,980 కోట్ల నుండి 12 శాతం తగ్గి రూ.21,935 కోట్లకు చేరిందన్నారు. గత ఆర్థిక సంవత్సరానికిగాను ఇక ఒక్కోషేర్ కు రూ.1 తుది డివిడెండ్ ను ఇవ్వనున్నట్టు చెప్పారు.తమ నెట్ వర్క్ లో ఇన్ కమింగ్ ట్రాఫిక్ ను తట్టుకోవడానికి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారాయన.

ఆదాయం తగ్గిందిలా
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఆదాయం 7 శాతం తగ్గిందని, ఇబిలా మార్జిన్సలు 2.9 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారు.గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయవృద్ది రెండంకెల్లో ఉండేదన్నారు. కేవలం 3.6 శాతం వృద్దినే సాధించినట్టు ఎయిర్ టెల్ కంపెనీ ప్రకటించింది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2015-16 లో రూ.6,077 కోట్లుగా ఉన్న నికరలాభం గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో 38 శాతం తగ్గిరూ.3,800 కోట్లకు చేరింది.ఆదాయం ఒక్కశాతం వృద్దితో రూ.95,468 కోటలకు పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి.

రిలయన్స్ జియో ఆఫర్లతోనే దెబ్బ
రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా రెండో క్వార్టర్లలోనూ లాభాలు క్షీణించాయని ఎయిర్ టెల్ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ నికరలాభం 55 శాతం తగ్గింది.మూలధన పెట్టుబులను రూ.6,075 కోట్ల నుండి రేూ.3,808 కోట్లకు తగ్గించుకొన్నప్పటికీ నికర లాభంలో క్షీణత తప్పలేదని ఎయిర్ టెల్ ప్రకటించింది.రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్ కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తుతున్నాయన్నారు.

జియోతో దెబ్బతో టెలికం పరిశ్రమ ఆదాయం తగ్గుదల
రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. మార్చిలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించింది జియో. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా జియో ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ దూకుడుతో ఇతర టెలికం కంపెనీలు నష్టపోతున్నాయి. టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్థం చేసిందని నిపుణులు చెబుతున్నారు.టెలికం పరిశ్రమ ఆదాయం గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా క్షీణించిందని బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు టెలికం పరిశ్రమ బకాయిలు రూ.4.80 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా.

ఎయిర్ టెల్ వినియోగదారులు 35.6 కోట్లు
ఈ ఏడాది మార్చి నాటికి భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలో మొత్తం ఎయిర్ టెల్ వినియోగదారుల సంఖ్య 35.6 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో 77 శాతం ఉండే భారత్ మార్కెట్ లో ఈ కంపెనీకి 27.4 కోట్లమంది వినియోగదారులున్నారు.నిర్వహణ లాభాన్ని సూచించే ఇబిటా 13 శాతం తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 4 లో రూ.9,188 కోట్లుగా ఉన్న ఇబిటా గత ఆర్థిక సంవత్సరం (2016-17) క్వార్టర్ 4 లో రూ.7,993 కోట్లకు తగ్గింది. డేటా యూవరేజ్ రెవిన్యూ ఫర్ యూజర్ 17 శాతం క్షీణించి రూ.162 క, వాయిస్ యారవేజ్ రెవిన్యూ ఫర్ యూజర్ కూడ 17 శాతం తగ్గి రూ.114 లకు చేరాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications