జియో మరో సంచలన ఆఫర్ తెస్తోందట.. కొత్త టారిఫ్ తర్వాత!
ఏప్రిల్ 1నుంచి అమలయ్యే టారిఫ్ ప్లాన్స్ కు కస్టమర్స్ నుంచి వచ్చే స్పందనను బట్టి.. మరో సంచలన టారిఫ్ ప్లాన్ ను తెర పైకి తీసుకురావాలని జియో యోచిస్తున్నట్లుగా బిజినెస్ ఇన్ సైడర్ ఓ కథనాన్ని ప్రచురించింది.
న్యూఢిల్లీ: జియో దెబ్బతో మిగతా టెలికాం సంస్థలను దెబ్బేసిన రిలయన్స్.. ప్రస్తుతం టారిఫ్ వసూలుకు సిద్దమవతోన్న సంగతి తెలిసిందే, ఈ మేరకు ఏప్రిల్ 1నుంచి అమలయ్యే టారిఫ్ ప్లాన్స్ కు కస్టమర్స్ నుంచి వచ్చే స్పందనను బట్టి.. మరో సంచలన టారిఫ్ ప్లాన్ ను తెర పైకి తీసుకురావాలని జియో యోచిస్తున్నట్లుగా బిజినెస్ ఇన్ సైడర్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఏప్రిల్ 1నుంచి అమలయ్యే టారిఫ్ ప్లాన్స్ పట్ల కస్టమర్స్ విముఖత వ్యక్తం చేస్తే.. దాని స్థానంలో సంచలన టారిఫ్ ప్లాన్ ను అమలు చేయాలని జియో భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొత్త టారిఫ్ ప్లాన్ నుంచి ఎంతమంది తప్పుకుంటారు?, జియో ప్రైమ్ యూజర్స్ కాకుండా ఇంకెంతమంది ఈ టారిఫ్ ప్లాన్స్ ను ఉపయోగించుకుంటారు? వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని.. మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్ రూపొందించాలని జియో భావిస్తోంది.

వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ కొత్త ప్లాన్స్ అమలులోకి వస్తాయని సమాచారం. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కు నేటితో తుది గడువు కావడంతో.. ఇదే సేవలను మరో ఏడాది కాలానికి వినియోగించుకునేందుకు ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ను జియో తీసుకొచ్చింది. జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కు నేడే ఆఖరి తేదీ.
కాగా, ఒకసారి జియో కస్టమర్ల సంఖ్యను పరిశీలిస్తే.. ప్రస్తుతం జియోకు 10కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇందులో 5కోట్ల మంది ఇప్పటికే ప్రైమ్ ఆఫర్ కోసం రూ.99చెల్లించారు.












Click it and Unblock the Notifications