జియో మరో బంపర్ ఆఫర్: కస్లమర్లకు సమ్మర్ సర్‌ప్రైజ్..
ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఈ ఆఫర్ పొందవచ్చునని, దీనికన్నా ముందు ఏప్రిల్ 15లోపు జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించింది.
ముంబై: జియో ఫ్రీ సర్వీస్‌ను మరో 15రోజుల పాటు పొడగిస్తూ ఇటీవలే కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్.. తాజాగా మరో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ ప్రకటించింది. రూ.999తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 3నెలల పాటు 100జీబీ 4జీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు, అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్, జియో సబ్ స్క్రిప్షన్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. అయితే జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఈ ఆఫర్ పొందవచ్చునని, దీనికన్నా ముందు ఏప్రిల్ 15లోపు జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించింది.

కాగా, టెలికాం రంగంలో ఇప్పటికే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న జియో వచ్చే రోజుల్లో డీటీహెచ్ సేవల రంగంలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీటీహెచ్ సర్వీస్ కాకుండా కేబుల్ టీవి సేవలతో పాటు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి జియో దిగనున్నట్లు కూడా కథనలు వస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications